తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు.. ఉదయం 10.30 గంటలకు రోడ్డు మార్గంలో యాదగిరి గుట్టకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం దంపతులు.. ఉదయం 11.30 గంటలకు యాదాద్రికి చేరుకోనున్న ఆయన.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, ఆలయ ‘విమాన గోపురం’కు బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. ఇక, తన పర్యటనలో భాగంగా క్షేత్రంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర రెండోరోజు పాదయాత్రలో భాగంగా బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు పాదయాత్ర కొనసాగనుంది. బస్వాపూర్ గ్రామంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో కలిసి రచ్చ బండ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతారు. బీజేపీ లోకి పార్టీ చాలా మంది నాయకులు…
భువనగిరి కలెక్టరేట్‌లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి జిల్లా అధికారులపై సీరియస్ అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పనులపై అధికారుల్ని ఆరా తీసిన ఆయన.. తనకు పనుల జాబితా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో 140 కోట్ల రైతు బంధు బకాయిలున్నాయని, అలాగే ధాన్యం కొనుగోలులోనూ 30% డబ్బులు చెల్లించాల్సి ఉందని, వాటిని వెంటనే చెల్లించాలని అధికారుల్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేశారని, వాటిపై పార్లమెంటరీ…
యాదాద్రి భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ ఎక్స్‌ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. నిన్న అర్ధరాత్రి దాటాక పగిడిపల్లి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే చివరి బోగిలో మంటలు అంటుకున్నాయి. అది లగేజీ భోగిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేసారు. అయితే.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణీకులు రైలు ఆగగానే కిందికి దిగి పరుగులు తీశారు. దీంతో ఘటనపై సమాచారం అందగానే సికింద్రాబాద్ నుంచి…
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ ఆలయానికి భక్తులు రద్దీ కొనసాగుతోంది. నేడు ఆదివారం కావడంతో నృసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు తరలిరావడంతో క్యూకాంప్లెక్యులన్నీ నిండిపోయాయి. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షం పడుతుండటంతో భక్తులకు స్వామి దర్శనం ఇబ్బంది కరంగా మారింది. లోనికి వెళ్లేందుకు చాలా సమయం వేచి చేయాల్సి వస్తోంది. శనివారం రాత్రి నుంచి వాన పడుతుండటంతో.. భక్తుల వర్షానికి లెక్క…
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడం వల్లె వాహనాలను…
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం మూల మాస్త్ర హావనములు, పూర్ణాహుతి, సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించి, సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయి. రేపటి నుండి సుదర్శన నరసింహ హోమం, నిత్యా, శాశ్వత కళ్యాణం, నిత్యా, శాశ్వత బ్రహ్మోత్సవం పునఃప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. కాగా.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో రెండు రోజులుగా కన్నుల పండువగా జయంత్యుత్సవాలు…
మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ని స్కామ్ గ్రెస్ పార్టీ గా ప్రజలు చూస్తున్నారని, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. గన్ పార్క్ ముందు నుండి వెళ్లిన రాహుల్ గాంధీ అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలేదని, అమరవీరుల స్మృతి వనం నిర్మాణం…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు , పంటలు దెబ్బతిన్నాయన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ లోని ప్రధాన ఆలయమైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి పరిసరాలు కూడా వర్షపునీటితో దెబ్బతిన్నాయి. ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు వర్షం నీటితోపాటు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమత్తులు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆలయ అధికారులు వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని పనులకు సిద్దమైనారు. సన్నిధిలో ఎక్కడెక్కడ వర్షపు నీరు చేరి మట్టి పేరుకపోయిందో…