రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు పూర్తయి పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన దృష్ట్యా రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని దేవాదాయ ధర్మాదాయ కమీషనర్ హనుమంత రావు ఆదేశించడంతో అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులు ఎండబారిన పడకుండా షామియానాలు, ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల తాగునీటి సౌకర్యాలు, చిన్న పిల్లలకు పాలిచ్చే లాక్టేషన్ గదులు, వృద్దులు, వికలాంగులకు వీల్ ఛైర్లు,…
Yadagirigutta: యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షేత్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
Huge Rush At Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవ భాగంగా నేడు మూడవ…
అసెంబ్లీలో విద్యుత్ రంగంపై జరుగుతున్న స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు దాడి చేస్తున్నాం అనుకుంటున్నారన్నారు. అది రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో తెలియడం లేదు వాళ్లకని విమర్శించారు. గత ప్రభుత్వం వాస్తవాలు ఎప్పుడూ సభ ముందు పెట్టలేదని అన్నారు. విద్యుత్ శాఖను స్కానింగ్ చేసి ప్రజల ముందు పెడతాం.. వాస్తవాలు ఒప్పుకుని.. హుందాగా ఉంటే బాగుంటుందని తెలిపారు. జగదీష్ రెడ్డి విచారణ చేయండి అని సవాల్ విసిరారు.. జ్యుడీషియల్…
తెలంగాణలో కొలువై ఉన్న మహిమాన్విత దేవుడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు.. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలుచేసిన అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.. గురు,శుక్రవారాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.. అంతేకాదు భక్తుల రద్దీతో స్వామివారి ఆదాయం రూ. 46,65,974 సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు.. తాజాగా ఈ రెండు రోజుల్లో పెరిగిన ఆదాయం వివరాలను ఆలయ అధికారులు తెలిపారు.. ఆ…
ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ‘బీఆర్ఎస్ సభలల్లో జన సునామీ కనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ల మీటింగ్‌లకు మాత్రం జనాలు రావడం లేదు. 80 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు అన్నదాతలకు కష్టాలు. రేవంత్ 3 గంటలు కరంట్ చాలు అంటున్నాడు. కర్ణాటక DY సీఎం శివ కుమార్ 5 గంటలు కరంట్ ఇస్తాం అని కుండ బద్దలు కొట్టాడు. Also Read: Teen…
Yadadri: వేల సంవత్సరాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా యాదాద్రి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా పునర్నిర్మించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నాటి వైభవాన్ని చెక్కుచెదరకుండా, ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్మించారు.
Yadadri MMTS: హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలను దక్షిణ మధ్య రైల్వే విస్తరిస్తోంది. ఎంఎంటీఎస్‌ను ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలకు విస్తరించారు.
ఎంఎంటీఎస్ ట్రైన్లు రాయగిరి స్టేషన్ వరకు పొడగించాలని గత ఆరేళ్ల క్రితమే కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. మౌలాలి నుంచి ఘట్కేసర్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం…
Falaknuma Express: యాదాద్రి భువనగిరి జిల్లా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో ఏడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం 18 బోగీల్లో ఏడు బోగీలు దగ్ధం కావడంతో రైలు 11 బోగీలతో సికింద్రాబాద్ చేరుకుంది.