Yadadri : ఎండ తీవ్రత నేపథ్యంలో యాదాద్రిలో భక్తులకు సౌకర్యాల కల్పన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు పూర్తయి పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన దృష్ట్యా రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని దేవాదాయ ధర్మాదాయ కమీషనర్ హనుమంత రావు ఆదేశించడంతో అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులు ఎండబారిన పడకుండా షామియానాలు, ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల తాగునీటి సౌకర్యాలు, చిన్న పిల్లలకు పాలిచ్చే లాక్టేషన్ గదులు, వృద్దులు, వికలాంగులకు వీల్ ఛైర్లు, క్యూ కాంప్లెక్స్ ల వద్ద షెడ్ తదితర ఏర్పాట్లను చేపట్టాయి. దీనిలో భాగంగా, రాష్ట్రంలోనే ప్రధాన ఆలయమైన యాదగిరి శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి ఆలయంలో భక్తులకు విస్తృత ఏర్పాట్లను కల్పించారు.
Onion Export: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ.. 5 దేశాలకు మాత్రం అనుమతి..
Also Read
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్‌ను బార్‌గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్‌డ్రా..!
భక్తులు ఎండకు ఎండకుండా, కాళ్ళు కాలకుండా, వానకు తడవకుండా ఉండేందుకు గుట్ట పైన ప్రధాన ఆలయంలో ఆధునిక జర్మన్ హాంగర్ షెడ్ ను ఏర్పాటు చేశారు. ఉత్తర మాడ వీధిలో 23000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ హాంగర్ షెడ్ వల్ల స్వామి వారి దర్శనానంతరం భక్తులు సేద తీరడానికి సౌకర్యం ఏర్పడింది. అదేవిధంగా, క్యూ లైన్లలో బాలింతలు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా లాక్టేషన్ గదులను ఏర్పాటు చేశారు. వేసవి సందర్బంగా దాహార్థి తీర్చేందుకు జర్మన్ హాంగర్ సమీపంలోనూ, క్యూ లైన్ల వద్ద మంచినీటి నల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులు కూర్చోవడానికి ప్రత్యేకంగా సీటింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దేని దృష్టిలో ఉంచుకొని క్యూ కాంప్లెక్స్ వద్ద ఏసీ సామర్ధ్యాన్ని పెంచడం జరిగింది. వృద్దులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రోటోకాల్ విభాగం వద్ద వీల్ చైర్ల సదుపాయం కల్పించారు. దైవ దర్శనానికి వెళ్లే భక్తులకు టికెట్ కౌంటర్ నుండి క్యూ కాంప్లెక్స్ వరకు షెడ్ లను ఏర్పాటు చేయడం జరిగింది.
Nitish Kumar: “ఇక శాశ్వతంగా ఎన్డీయేలోనే ఉంటా”.. ప్రధాని ముందు నితీష్ కుమార్ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ట్రెండింగ్
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!