Yadadri MMTS: ప్రారంభమైన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులు.. గుట్ట వద్ద ప్రత్యేక ట్రాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri MMTS: హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలను దక్షిణ మధ్య రైల్వే విస్తరిస్తోంది. ఎంఎంటీఎస్‌ను ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలకు విస్తరించారు. కాగా.. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. ఎంఎంటీఎస్ సర్వీసులను యాదాద్రి వరకు పొడిగించే ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చును రైల్వే శాఖ భరిస్తుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ డీఆర్‌ఎం ఏకే గుప్తాతో కలిసి ఇటీవల యాదాద్రి రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రత్యేక రైల్వే ట్రాక్ నిర్మిస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న యాదాద్రి రైల్వే స్టేషన్‌కు ఎదురుగా కొండ వైపు మరో రైల్వే స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు.
Read also: Prabhas-Ram Charan: ఏదో ఒక రోజు రామ్ చరణ్‌తో సినిమా చేస్తా: ప్రభాస్
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
యాదాద్రి ఆలయ నమూనాలో కొత్త రైల్వేస్టేషన్ ముఖద్వారం నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. యాదాద్రి వరకు ఇప్పటికే రెండు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. కానీ ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ప్రత్యేక ట్రాక్ నిర్మిస్తారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే అతి తక్కువ ధరకే భక్తులు ప్రయాణించవచ్చు. యాదాద్రి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యాదాద్రికి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. MMTS అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో హాయిగా ప్రయాణం చేయవచ్చు. 2016లోనే యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లో ప్రాజెక్టు అంచనా రూ.330 కోట్లు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు సాకారం కాలేదు. ఇప్పుడు అంచనా వ్యయం రూ.430 కోట్లకు చేరగా.. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే శాఖ ఈ పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా యాదాద్రి రైల్వే స్టేషన్లను సర్వాంగ ఆధునీకరించనున్నారు. ఎంఎంటీఎస్ పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాదాద్రికి 30 నిమిషాల్లో చేరుకోవచ్చు.
Warangal: కన్నీటి సంద్రంలో రైతన్న.. చెత్తకుప్పకు చేరిన లక్షలు విలువ చేసే టమాటా..!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!