తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించ తలపెట్టిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రి సీఎం కేసీఆర్ ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం లాంటి ఏర్పాట్లపై చినజీయర్‌తో చర్చించనున్నారు. అంతేకాకుండా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయం…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల జల వివాదాలు, కేంద్ర గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా భవనం ఏర్పాటు స్థలాన్ని కేటాయించాలని మోడీని కేసీఆర్ కోరారు. ఈ అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి…