వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్‌సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్‌లైన్ యాప్‌లను గుర్తించారు. ఈ యాప్‌లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు.
వరల్డ్ కప్ 2023 లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా పాకిస్తాన్ బౌలర్ హ్యారీస్ రవూఫ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్ లీగ్ స్టేజిలో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రవూఫ్ నిలిచాడు. ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును సాధించాడు. వరల్డ్‌కప్ 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన రవూఫ్ అందరి బౌలర్ల కంటే ఎక్కువగా 533 పరుగులిచ్చాడు.
ఈ మెగా టోర్నీలో నవంబరు 15న తొలి సెమీఫైనల్, నవంబరు 16న రెండో సెమీఫైనల్ జరగనుంది. నవంబరు 19న ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ మూడు నాకౌట్ మ్యాచ్ ల కోసం తుది విడత టికెట్లను ఈరోజు విక్రయించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://tickets.cricketworldcup.com. ద్వారా కూడా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
2023 వరల్డ్ కప్లో భాగంగా.. రేపు (ఆదివారం) ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగునుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి టేబుల్ టాప్లో ఉన్న టీమిండియా మంచి జోరు ఉంది. అటు సౌతాఫ్రికా కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ రేపు రసవత్తరంగా జరుగబోతుంది.
జస్ప్రీత్ బుమ్రా వన్డే ప్రపంచ కప్ 2023లో ఓ అరుదైన ఘనత సాధించాడు. 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఇండియన్ బౌలర్ చేయలేని ఘనతను సాధించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లనే తొలి బంతికే వికెట్ తీశాడు.
ప్రపంచకప్ 2023లో ఆసీస్ జట్టు తొలి మ్యాచ్ టీమిండియాపై, ఆ తర్వాతి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత నుంచి ఆస్ట్రేలియా జట్టు పుంజుకుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ వరుసగా విజయం సాధించింది. బ్యాటింగ్లో రాణించడం వల్లే ఆసీస్ జట్టు గెలుపొందిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ 350కి పైగా పరుగులు చేసింది. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే ఆసీస్ జట్టు అరుదైన రికార్డ్ ను సాధిచింది.
షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ పై భారత మాజీ దిగ్గజం ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. “బెంగళూరులోని ఈ ఫ్లాట్ పిచ్‌పై షాహీన్ 5 వికెట్లు తీయడం గొప్ప అని చెప్పుకొచ్చాడు. కేవలం షాహీన్ తప్ప.. మిగతా బౌలర్లు ఫెయిలయ్యారని విమర్శించాడు. మిగతా నెటిజన్లు కూడా స్పందించారు.
ఈ వరల్డ్ కప్ లోనైనా పాకిస్తాన్ గెలవాలనే కసితో దిగినప్పటికీ.. 8వ సారి ఇండియా చేతిలో ఓటమిపాలైంది. మరోసారి పాకిస్థాన్‌పై టీమిండియా అద్భుతం చేసి చూపించిందని గంభీర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియా-పాక్ ఈ టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు.
నిన్న జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ పై క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అంతేకాకుండా.. ఇంగ్లండ్ ఆఫ్ఘాన్ పై ఓడటంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది.