ప్రపంచకప్ 2023లో ఆసీస్ జట్టు తొలి మ్యాచ్ టీమిండియాపై, ఆ తర్వాతి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత నుంచి ఆస్ట్రేలియా జట్టు పుంజుకుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ వరుసగా విజయం సాధించింది. బ్యాటింగ్లో రాణించడం వల్లే ఆసీస్ జట్టు గెలుపొందిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ 350కి పైగా పరుగులు చేసింది. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే ఆసీస్ జట్టు అరుదైన రికార్డ్ ను సాధిచింది. వరుసగా మూడోసారి 350కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.
Read Also: Travis Head: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన రికార్డ్
ఈరోజు ధర్మశాలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచకప్ 27వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ దూకుడు ఇన్నింగ్స్ తో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. 19.1 ఓవర్లలో 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో చివరికి ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయింది. గతంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. ఇదే తరహాలో బ్యాటింగ్ చేసింది.
Read Also: Janga Raghava Reddy: నాపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు..
అంతకు ముందు పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్ లో.. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టు 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయి మ్యాచ్ ఓడిపోయింది. దీంతో ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 350 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.