ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ పై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 కీలక వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత.. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ షమీపై పొగడ్తల వర్షం కురిపించాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యా్చ్లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్ చేసిన పాక్.. 45.1 ఓవర్లలో 204 పరుగులకే బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేసింది.
వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు పేలవ ఫాం కొనసాగుతుంది. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపడం లేదు. ముఖ్యంగా బౌలర్ల విషయానికొస్తే.. మొదట్లో ఫామ్లో లేని షహీన్ షా అఫ్రిదీ.. రెండు మ్యాచ్ల తర్వాత పుంజుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు ఫెయిల్యూరే. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ఈ టోర్నీలో పూర్తిగా నిరాశపరిచాడు. అతని బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్ వీరవిహారం చేస్తున్నారు.
గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా తర్వాతి మ్యాచ్‌లో జట్టులో చేరనున్నాడు. నవంబర్ 2న ముంబైలో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ వరకు జట్టులోకి వస్తాడు కానీ.. మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
2023 ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు వరుసగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బ్యాట్స్‌మెన్, బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆసియా కప్లో విజృంభించిన సిరాజ్.. వరల్డ్కప్ మ్యాచ్లకు ఫామ్లో లేకపోవడం టీమిండియాకు ఇబ్బందిని కలిగిస్తోంది.
ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్ ఎటాక్ లో దిగిన పాకిస్తాన్.. తొలి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి ఓవర్ 5 బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తాంజిద్ హసన్ వికెట్ పడగొట్టాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన…
Mohammad Rizwan Says birthday wishesh to Virat Kohli: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో విజయాలలు సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్కు…
Pakistan vs Bangladesh Playing 11 Out: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో మరో కొద్దిసేపట్లో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో పాక్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. ఇమామ్, షాదాబ్, నవాజ్ స్థానాల్లో…
Is Suryakumar Yadav take Shreyas Iyer place once Hardik Pandya is back to Team: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. చీలమండ నొప్పితో విలవిల్లాడిన హార్దిక్.. తన ఓవర్ పూర్తిచేయకుండానే మధ్యలోనే మైదానం వీడాడు. ఆపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న హార్దిక్.. గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్…
CAB to distribute 70000 Virat Kohli Masks to Fans during IND vs SA Match : ప్రపంచకప్ 2023లో భాగంగా నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. నవంబర్ 5న టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు. కింగ్ కోహ్లీ 35వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. దీంతో బర్త్ డే రోజు విరాట్…