Virat Kohli Birthday: బర్త్ డే రోజు ‘కింగ్’ కోహ్లీ సెంచరీ చేస్తాడు.. పాకిస్తాన్ క్రికెటర్ జోస్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Rizwan Says birthday wishesh to Virat Kohli: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో విజయాలలు సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. నవంబర్ 5న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 35వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే కోహ్లీకి బర్త్ డే విషెష్ చెప్పిన పాకిస్థాన్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్.. దక్షిణాఫ్రికాపై సెంచరీ చేయాలని కోరుకున్నాడు.
ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు మహ్మద్ రిజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ విరాట్ కోహ్లీకి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు అని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. నేను బర్త్ డేలను సెలబ్రేట్ చేసుకోను. అయితే కోహ్లీకి ముందే పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతున్నా. ఈ బర్త్ డే అతడికి ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నా. పుట్టినరోజున కోహ్లీ 49వ వన్డే సెంచరీ చేస్తాడని నేను అనుకుంటున్నా. ప్రపంచకప్ 2023లోనే కోహ్లీ 50వ సెంచరీ కూడా చేయాలనీ కోరుకుంటున్నా’ అని మహ్మద్ రిజ్వాన్ తెలిపాడు.
Also Read
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
Also Read: PAK vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. మూడు మార్పులతో బరిలోకి పాకిస్తాన్! పరువు కోసం పోరాటం
ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డేల్లో 48 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే వన్డేల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. ఇక ఇంకో సెంచరీ చేస్తే.. శతకాల హాఫ్ సెంచరీని అందుకుంటాడు. కోహ్లీ ఫామ్‌ని చూస్తుంటే.. ఈ ప్రపంచకప్‌లోనే ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశముంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో విరాట్ 354 రన్స్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి టీమిండియాకు ప్రపంచకప్ అందిస్తాడని ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!