Irfan Pathan: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరులు సామాన్య పాలస్తీనియన్లు చనిపోతున్నారు. అంతకుముందు అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని ఊచకోత కోశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా తలలు కోసి చంపేశారు. ఈ దాడి తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై భీకర దాడి చేస్తోంది. హమాస్ సంస్థను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 243 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లలో అత్యధికంగా రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు.
సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. కల నెరవేరిందన్నాడు. భారత్ తరఫున ఆడే ప్రతి అవకాశం తనకు చాలా పెద్దదని తెలిపాడు. తన పుట్టినరోజున ప్రేక్షకుల ముందు ఈ రికార్డు నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించే అవకాశమిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు.
కోహ్లీ ఈ ఘనత సాధించడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. విరాట్ పై అభినందనల వర్షం కురిపించాడు. బాగా ఆడావు అంటూ కితాబునిచ్చారు. ఈ రోజు విరాట్ బర్త్ డే విషయాన్ని ప్రస్తావిస్తూ చమత్కారంగా వ్యాఖ్యానించారు. "నేను 49 నుంచి 50 ఏళ్ల వయసుకు చేరుకునేందుకు 365 రోజులు పట్టింది... కానీ నువ్వు కొన్ని రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకోవాలని కోరుకుంటున్నాను... తద్వారా నా రికార్డు బద్దలు కొడతావని ఆశిస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో…
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు చేసింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ (101) సెంచరీతో చెలరేగాడు. తన బర్త్ డే రోజు సెంచరీ సాధించడంతో అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రపంచ కప్లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ తన బర్త్ డే రోజున సెంచరీ చేసి.. తన ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చాడు. 119 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. నిలకడగా ఆడుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (40), గిల్ (23) పరుగులు చేసి మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (55), అయ్యర్ (60) పరుగులతో ఉన్నారు.
జట్టు పరాజయాలపై కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించారు. ఈ టోర్నీలో తాను ఫామ్ కోల్పోవడం జట్టుకు చేటుచేసిందని అన్నాడు. ఈ టోర్నీలో బట్లర్ ఒక్క మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ చేయలేదు. ఇదిలా ఉంటే.. గత ఐదు మ్యాచుల్లో ఇంగ్లండ్ రెండుసార్లు మాత్రమే 200కుపైగా పరుగులు సాధించింది. ఈ వరల్డ్ కప్ లో బాగా ఆడి.. టైటిల్ సాధించాలని అనుకున్నామని, తాను ఆశించిన స్థాయిలో ఆడకపోవడమే జట్టు ఓటమిలకు దారి తీసిందన్నాడు.
Happy Birthday Kohli: భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. నేడు తన పుట్టినరోజు. ఈ రోజు కోల్‌కతా మైదానంలో ఆడే మ్యాచ్ ఆయనకు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీస్ ఆశలు మరింత బలమయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.