ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాక్.. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో వర్షం రెండుసార్లు రావడంతో అంఫైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి వర్షం పడినప్పుడు ఓవర్లను 41కి కుదించగా, లక్ష్యాన్ని కూడా 342కు తగ్గించారు. ఈ క్రమంలో మరోసారి వర్షం పడుతుండటంతో పాకిస్తాన్ విజేతగా ప్రకటించారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే వరుణుడు ఒక్కసారి అడ్డుతగలగా.. మరోసారి ప్రత్యక్షమయ్యాడు. దీంతో మళ్లీ ఆటను ఆపేశారు.
న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం అడ్డంకి తగిలింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఒకవేళ ఇలానే వర్షం పడితే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ జట్టుకు కలిసొచ్చే అవకాశముంది. డీఎల్ఎస్ ప్రకారం చూసుకుంటే.. పాకిస్తాన్ 10 పరుగులు ఎక్కువ సాధించింది. ఈ క్రమంలో ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, పాకిస్తాన్ ను విజేతగా ప్రకటిస్తారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు బెంగళూరులో న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు చెత్త రికార్డును నెలకొల్పారు. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అత్యంత చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్తాన్ బౌలర్‌గా అఫ్రిది నిలిచాడు.
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆడుతున్న తొలి వరల్డ్ కప్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు. ఈ వరల్డ్ కప్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 3 శతకాలు నమోదు చేశాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టు పాకిస్తాన్పై వీరబాదుడు బాదింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ఈ వరల్డ్ కప్లో రెండో అత్యధిక స్కోరు ఇదే. కివీస్ బ్యాటింగ్లో ఓపెనర్ల మంచిగా రాణించారు. రచిన్ రవీంద్ర (108) మరో సెంచరీ నమోదు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు.
Kane Williamson becomes leading run-getter of New Zealand in 48 year old World Cup history: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడమే కాకూండా.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని కేన్ చేరుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 24 ఇన్నింగ్స్‌లో కేన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. పాకిస్తాన్ పేసర్…
Hardik Pandya express his emotion after Ruled Out of ODI World Cup 2023: గాయం కారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని తాను జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. తనపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుత జట్టు ప్రత్యేకమైనదని, ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుందని హార్దిక్…
Afghanistan’s ODI World Cup 2023 Semi Final Scenario : ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే భారత్ అధికారిక సెమీస్ బెర్త్ దక్కించుకోగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల నిష్క్రమణ కూడా ఖాయం. సెమీస్‌లోని మూడు బెర్తుల కోసం 5 జట్ల మధ్య పోటీ నెలకొంది. 12 పాయింట్స్ ఉన్న దక్షిణాఫ్రికాకు ఓ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. మరో మ్యాచ్ గెలిస్తే…
Kane Williamson back in Zealand vs Pakistan Match: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక పోరు ఆరంభం అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సెమీస్ బెర్త్ ఆశిస్తున్న న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. ఉసామా మీర్ స్థానంలో హసన్ అలీ ఆడుతున్నాడు. మరోవైపు కివీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.…