వన్డే వరల్డ్ కప్ 2023లో దూసుకెళ్తున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన సత్తాను చాటుకుంది. వన్డేల్లో నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటారు.
వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.
ఆస్ట్రేలియాపై ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇబ్రహీం జద్రాన్ 131 బంతుల్లో సెంచరీ మార్కును తాకాడు. ఈ ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఇబ్రహీం జద్రాన్ నిలిచాడు. 143 బంతుల్లో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించలేదు.
ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం పోటీ పడే వారిలో ఈ వరల్డ్‌కప్‌లో ఆడే ఆటగాళ్లు ఉన్నారు. అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఇండియా తరుఫున జస్ప్రీత్ బుమ్రా, సౌతాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర ప్రకటించబడ్డారు.
ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఇంట్లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్ల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో హర్భజన్ సింగ్, అద్నాన్ సమీ, ప్రముఖ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందుకు సంబంధించి.. అద్నాన్ సమీ X (ట్విట్టర్)లో ఒక ఫోటోను షేర్ చేశారు.
Afghanistan have won the toss and have opted to bat vs Australia: ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకొవాలని చూస్తున్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ సారథి హష్మతుల్లా షాహిది బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేసినట్లు తెలిపాడు. ఫజల్హక్ స్థానంలో విరాట్ కోహ్లీ దోస్త్ నవీన్…
Shakib Al Hasan not withdrawing his decision after Umpires Asked Two Times: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’గా పెవిలియన్ చేరడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ హల్ హాసన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని పలువురు క్రికెట్ మాజీలు అంటున్నారు. అయితే ఈ వివాదంలో మరో…
Bangladesh Captain Shakib Al Hasan React on Angelo Mathews Timed Out dismissal: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కన్నా ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి.. టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వికెట్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మాథ్యూస్.. గార్డ్ తీసుకోకుండా హెల్మెట్ (కొత్త హెల్మెట్) కోసం వేచి చూశాడు.…
Angelo Mathews Slams Shakib Al Hasan and Bangladesh Team over Controversial Timed Out dismissal: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ బంగ్లాదేశ్ జట్టుపై మండిపడ్డాడు. తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదన్నాడు. బంగ్లా ఆటగాళ్లకు, అంపైర్ల కామన్‌సెన్స్ ఏమైందో తెలియదన్నాడు. తనకు ఇంకా సమయం ఉన్నా టైమ్ ఔట్‌గా ప్రకటించారని, వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నట్లు తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో…
Australia and Afghanistan Semi Final Chances for ODI World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకొవాలనుకుంటున్న ఆస్ట్రేలియా.. మెగా టోర్నీలో సంచలన విజయాలు సాధిస్తున్న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఆస్ట్రేలియాకే కాదు ఈ మ్యాచ్ అఫ్గానిస్థాన్‌కు చాలా కీలకం. ఆస్ట్రేలియాపై గెలిస్తే.. 10 పాయింట్స్ ఖాతాలో…