Cancer Cases: దేశంలో రానున్న కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ అంచనా వేస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్ ఈ అంచనాను రూపొందించింది. 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్‌విఎస్ డియో అన్నారు.