ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఎట్టకేలకు తన ఖాతా ఓపెన్ చేసింది. లక్నోలో నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్లో నెదర్లాండ్ జట్టు గెలవడం కంటే మంచి ప్రదర్శన చూపించారు.
ప్రపంచ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని ఎం చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాలో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా పాకిస్తాన్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
2023 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రెండో విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 199 పరుగులకే ఆలౌటైంది.
2023 వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ప్రారంభించింది. ఢిల్లీలో జరిగిన సౌతాఫ్రికా-శ్రీలంక మధ్య మ్యాచ్ లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 102 పరుగుల తేడాతో భారీ గెలుపును నమోదు చేసింది. మొదటగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు.
ఆసియా క్రీడలు 2023 టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తుంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో పసడి సాధించారు.
ఆసియా క్రీడల్లో మెన్స్ టీమిండియా స్వర్ణం సాధించింది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ పూర్తి కాలేదు. దీంతో ఎక్కువ ర్యాంకింగ్ కారణంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు ఖాతాలో మరో స్వర్ణం చేరింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఆఫ్ఘాన్ కి బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను 37.2 ఓవర్లలో 156 పరుగులకి బంగ్లాదేశ్ బౌలర్లు ఆలౌట్ చేశారు.
ఆదివారం జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ విజృంభించింది. ఇవాళ ఒకే రోజు 15 పతకాలు సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో చరిత్రలో తొలిసారిగా భారత ఆటగాళ్లు భారీ రికార్డు సృష్టించారు.