2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అత్యంత హాట్‌స్టేట్ సీట్లలో ఒకటైన వారణాసి సీటు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి మూడోసారి గెలుపొందారు. కాగా.. ఈరోజు వారణాసిలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తొలి రౌండ్ నుంచి మోడీ వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత.. పుంజుకోగా 1.5 లక్షలకు పైగా ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా విజయం సాధించారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సోనాల్ రమణ్‌భాయ్ పటేల్‌పై 7 లక్షల ఓట్ల ఆధిక్యతతో అఖండ విజయం సాధించారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. అమిత్ షాకు మొత్తం 10,109, 72 ఓట్లు రాగా, పటేల్‌కు 2,66,256 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడి నుంచి శశిథరూర్ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని ప్రజలు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామని కేటీఆర్ తెలిపారు. మనం కూడా జై శ్రీరామ్ అందాం.. రాముడు అందరివాడు.. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ లో…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యా్చ్ ప్రారంభం కానుంది. ఈసారి ముంబై జట్టు కొత్త కెప్టెన్ హార్థిక్ పాండ్యాతో బరిలోకి దిగుతుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీపై పంజాబ్ గెలిచింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సామ్ కరణ్ (63), లివింగ్ స్టోన్ (38*) పరుగులతో రాణించడంతో జట్టు విజయం సాధించింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. ఓపెనర్లు శిఖర్ దావన్ (22), బెయిర్ స్టో (9) పరుగులు చేశారు. ఆ…
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ జట్టును 434 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ (214), సర్ఫరాజ్ ఖాన్ (68) పరుగులతో అదరగొడితే.. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయజాలం చేశాడు. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 122 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్…
సీనియర్లు వరల్డ్ కప్ను చేజార్చారు. ఇప్పుడు జూనియర్లు అదే పని చేశారు. జూనియర్లు అయినా.. వరల్డ్ కప్ గెలిచి ప్రతికారం తీర్చుకుందామనుకుంటే.. వీళ్లు కూడా మేము కూడా మీ వెంటనే ఉంటామన్నంటూ కప్ గెలవలేకపోయారు. ఫైనల్ వరకు వచ్చి టైటిల్ ను మిస్సయ్యారు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత్ 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. 254 పరుగుల లక్ష్యచేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా…
సౌతాఫ్రికాలో జరిగిన ఎస్ఏ టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. నిన్న కేప్ టౌన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగుల భారీ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్లో జోర్డాన్ హెర్మన్ 42, అబెల్ 55,…
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6, 7-5తో ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవసోరిని ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. అతను 2022లో మార్సెలో అరెవోలాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీని గెలుచుకున్న జీన్-జూలియన్ రోజర్ రికార్డును బద్దలు కొట్టాడు.…