టీమిండియా మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే.. అది ఒకే రోజు, ఒకే సమయంలో టీమిండియా మ్యాచ్‌లు ఫ్యాన్స్ కు పండగే పండగ.. ఒకవైపు పురుషుల జట్టు.. మరోవైపు మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా దుబాయ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్…
ఆసియా క్రీడలు 2023లో టీమిండియా ఉమెన్స్ క్రికెట్ జట్టు పసిడిని ముద్దాడింది. మహిళల క్రికెట్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో శ్రీలంకపై భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం బౌలర్ల అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను 20 ఓవర్లలో 97 పరుగులకే పరిమితం చేసి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
CommonWealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ దూసుకుపోతోంది. భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. లాన్ బౌల్స్ క్రీడలో ఇండియాకు రజతం లేదా స్వర్ణ పతకం వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఆదివారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్ క్రీడా పోటీల్లో నార్ఫోక్ ఐలాండ్‌ను ఓడించి భారత మహిళల ఫోర్స్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను భారత్ 16-13 తేడాతో…