CommonWealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ దూసుకుపోతోంది. భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. లాన్ బౌల్స్ క్రీడలో ఇండియాకు రజతం లేదా స్వర్ణ పతకం వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఆదివారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్ క్రీడా పోటీల్లో నార్ఫోక్ ఐలాండ్‌ను ఓడించి భారత మహిళల ఫోర్స్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను భారత్ 16-13 తేడాతో ఓడించింది. దీంతో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో లాన్ బౌల్స్ క్రీడలో తొలిసారి భారత్ పతకం సాధించబోతోంది. ఇప్పటికే కామన్వెల్త్ క్రీడల్లో ఆరు పతకాలు సాధించిన భారత్‌కు ఇప్పుడు ఏడో పతకం ఖరారైంది.
Read Also: WhatsApp : వాట్సాప్ వీడియోకాల్స్‌తో జాగ్రత్త.. ట్రాప్‌లో పడకండి..
భారత్ ఇప్పటివరకు సాధించిన పతకాలను గమనిస్తే.. మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, జెరెమీ లాల్రినుంగా 67కేజీల విభాగంలో స్వర్ణం, అచింత షెవులి 73 కేజీల విభాగంలో స్వర్ణం.. సంకేత్ మహదేవ్ 55 కేజీల విభాగంలో రజతం.. బింద్యారాణి దేవీ 55 కేజీల విభాగంలో రజతం.. గురురాజ్ పూజారి 61కేజీల విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. ఇప్పుడు మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ టీం గోల్డ్ మెడల్ లేదా సిల్వర్ మెడల్ సాధించే అవకాశం కనిపిస్తోంది.