Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Ntv Story Board About Womens Reservation Bill

Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లు.. చట్టసభలన్నింటికీ రిజర్వేషన్ వర్తిస్తుందా?

Published Date :July 10, 2025 , 12:32 pm
By Sudhakar Ravula
  • మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం..
  • దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏకాభిప్రాయం..
  • ఎలా అమలుచేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు..
Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లు.. చట్టసభలన్నింటికీ రిజర్వేషన్ వర్తిస్తుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board: దేశంలో మహిళా సాధికారత దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో కూడా దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం వస్తుండటం మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ అమలుకు సుముఖంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు ఆ దిశగా కీలక ప్రకటనలు చేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్‌ అమలు కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 60 మంది మహిళలకు టికెట్లు ఇవ్వడంతోపాటు వారిని గెలిపించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని ప్రకటించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూడా అలాంటి ప్రకటనే చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. బిహార్‌లో శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా ప్రతి విభాగంలోని అన్ని పోస్టులకు ఆ ప్రత్యేక రిజర్వేషన్‌ వర్తిస్తుందని సీఎం చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ సర్వీసుల్లో స్త్రీల ప్రాతినిధ్యాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

దేశంలోని మెజారిటీ పార్టీల మద్దతున్నప్పటికీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వడానికి ఉద్దేశించిన బిల్లు ఆమోదానికి.. 27 ఏళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన బిల్లును తొలిసారిగా 1996లో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి సారథ్యం వహించిన అప్పటి ప్రధాని దేవెగౌడ…దీనికి సంబంధించి 81వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టినప్పటికీ అది అప్పుడు ఆమోదం పొందలేదు. అధికార సంకీర్ణ కూటమిలో ఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌, లాలు ప్రసాద్​లు ఈ బిల్లును వ్యతిరేకించారు. ఫలితంగా దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అధ్యయనం కోసం నివేదించారు. ఇక 1996 డిసెంబరులో కమిటీ తన నివేదికను సమర్పించింది. అంతలోనే లోక్‌సభ రద్దవడం వల్ల ఆ బిల్లు కాస్త ఆమోదం పొందకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత 1997లో గుజ్రాల్‌ ప్రభుత్వంలోనూ బిల్లు పెట్టినప్పటికీ.. మళ్లీ అధికార కూటమిలోని పార్టీలు అడ్డుకున్నాయి. అంతలోనే కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల గుజ్రాల్‌ సర్కార్​ అమాంతం కూలడం.. బిల్లు అటకెక్కటం ఇలా అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.

దాదాపు రెండేళ్ల తర్వాత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా బిల్లును లోక్‌సభలో పెట్టింది. కానీ ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడ్డ ఈ సర్కారు దాన్ని ఏమీ చేయలేకపోయింది. అప్పటి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న నితీశ్‌ కుమార్‌ స్వయంగా ఈ బిల్లును వ్యతిరేకించారు. 1999లో అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణ వల్ల వాజ్‌పేయీ సర్కారు పడిపోయింది. దీంతో మహిళల బిల్లు కథ కంచికి చేరింది. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన వాజ్‌పేయీ.. పట్టవదలని విక్రమార్కుడిలా బిల్లును మరోసారి చట్ట సభల్లో ప్రవేశపెట్టారు. కానీ వివిధ పార్టీల్లోని ఓబీసీ నేతలు దాన్ని ముందుకు సాగనివ్వలేదు. దీంతో 2003లో మరోమారు వాజ్‌పేయీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. కానీ చట్టం కావడానికి అవసరమైన మద్దతును మాత్రం ఆ ప్రభుత్వం సంపాదించలేకపోయింది.

2008లో మన్మోహన్‌ సింగ్‌ సారథ్యంలోని యూపీఏ సర్కార్​.. మహిళా బిల్లును లోక్‌సభలో కాకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బీజేపీ, వామపక్షాలు మద్దతివ్వడం వల్ల పెద్దల సభలో ఈ బిల్లు ఆమోదానికి అవసరమైన బలం సమకూరింది. కానీ.. లాలు, ములాయంలు మరోసారి అడ్డుపడటం ఆరంభించారు. ఓబీసీ, మైనారిటీ మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని పట్టుబట్టారు. అంటే రిజర్వేషన్లలో రిజర్వేషన్లు కావాలని వారి ఉద్దేశం. ప్రస్తుత బిల్లు.. నా శవం మీదుగానే ఆమోదం పొందాల్సి ఉంటుందంటూ లాలు హెచ్చరికలు జారీ చేశారు. 2008 మే లో ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపించారు. సోనియా గాంధీ, బృందా కారత్, సుష్మా స్వరాజ్‌.. ఈ ముగ్గురూ కలిసి పార్టీలకు అతీతంగా యాదవ్‌ నేతల ద్వయాన్ని బలంగా అడ్డుకోవడంతో…2010 మార్చి 9న అనూహ్యంగా ఈ బిల్లును రాజ్యసభ 186-1 ఓట్ల తేడాతో ఆమోదించింది. అలా కాంగ్రెస్‌, వాపక్షాలు, బీజేపీ కలిసి నడిచిన అరుదైన సందర్భాన్ని అప్పటి సభ చూసింది. కానీ లోక్‌సభలో బిల్లు చర్చకు మాత్రం రాలేదు. 2014లో సభ గడువు ముగియడంతో అది పనికిరాకుండానే పోయింది.

1987లో రాజీవ్‌ గాంధీ సర్కారు.. దేశంలో మహిళల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అప్పటి కేంద్ర మంత్రి మార్గరెట్‌ అల్వా సారథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మహిళలకు జాతీయ విధానం అంటూ ఓ నివేదికను సమర్పించింది. అందులో 353 సిఫార్సులు ఉన్నాయి. వాటిలో ఉమ్మడి పౌరస్మృతి అమలుతో పాటు మహిళలకు ఆస్తి హక్కు, చట్టసభల్లో కొన్ని సీట్లు కేటాయించాలని అందులో సూచించారు. పంచాయతీలు, నగర పాలికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించి 1989లో రాజ్యాసభ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే లోక్‌సభలో ఆమోదించినప్పటికీ రాజ్యసభలో రాజీవ్‌ సర్కారు విఫలమైంది. కానీ పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆ బిల్లులను 1993లో మళ్లీ ప్రవేశ పెట్టి ఆమోదం పొందారు. అవి చట్టాలుగా మారి ప్రస్తుతం స్థానిక సంస్థల్లో 40 శాతం పైగా మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తోంది.

భారత్‌లో స్వాతంత్య్రానికి ముందు నుంచే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండేవి. బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో 1935 చట్టం రాష్ట్రాల చట్ట సభల్లో 41 సీట్లు, సెంట్రల్‌ లెజిస్లేచర్‌లో పరిమిత సీట్లను మతాల వారీగా మహిళలకు కేటాయించింది. అదీ వివాహితలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇది మహిళలపై ప్రేమతో, గౌరవంతో ఇచ్చిందేమీ కాదు. విభజించు పాలించు సూత్రంలో భాగంగా స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మహిళలను దూరం చేసేందుకు ఆంగ్లేయులు వేసిన ఎత్తుగడ. దేశంలోని మహిళలందరికీ ఓటు హక్కు ఇవ్వడానికి కూడా అంగీకరించని ఆంగ్లేయులు చట్ట సభల్లో సీట్లు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం అదే. అందుకే ఆఖరికి మహిళా సంఘాలే ఈ రిజర్వేషన్లు తమకు వద్దని నినదించాయి. రాజ్యాంగ సభలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే అందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నాం కాబట్టి…అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో చట్ట సభల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని రాజ్యాంగ నిర్మాణ సభ భావించింది. భారత మహిళలకు సమానత్వం కావాలి తప్ప రిజర్వేషన్లు కాదంటూ పూర్ణిమా బెనర్జీ, సరోజిని నాయుడు, రేణుకా రేలు రాజ్యాంగ సభలో వాదించారు. అందుకే 1935 చట్టంలో ఉన్న అనేక అంశాలు స్వాతంత్య్రానంతరం రాజ్యాంగంలో భాగమైనా మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లను తొలగించారు.

ఎట్టకేలకు 2023 సెప్టెంబరులో పార్లమెంటు ఉభయసభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంతో దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్టయింది. ఇక ఇప్పుడు రిజర్వేషన్ల అమలుపై చర్చలు ఊపందుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్ స్ఫూర్తి చెడకుండా తాము అమలు చేసి చూపిస్తామని రాజకీయ పార్టీలు ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నాయి. మొత్తం మీద 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లు అమలౌతాయని తేలడంతో.. ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది చూడాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTV Story board
  • Reservation Bill
  • story board
  • Women
  • womens reservation bill

తాజావార్తలు

  • Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

  • LPG Crisis: భారత్‌కు గుడ్‌ న్యూస్.. హార్ముజ్ నుంచి బయలుదేరిన LPG నౌకలు..

  • Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

  • Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

  • Robbery: యశోద ఆసుపత్రిలో బంగారు ఆభరణాలు చోరీ.. కిలేడీ చేసిన పనికి అంతా షాక్..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions