పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు, సహజీవనాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. కుటుంబాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన భార్యతో గొడవపడుతుందని తనతో సహజీవనం చేస్తున్న మహిళను అంతమొందించాడు ఓ ప్రియుడు. కొనిజర్ల మండలం విక్రమ్ నగర్ లో భార్యతో గొడవ పడుతుందని సహజీవనం చేస్తున్న మహిళను లక్ష రూపాయలు సుపారి ఇచ్చి ప్రియురాలిని హత్య చేయించాడు. Also Read:NBK : బి. సరోజా దేవి మృతి పట్ల బాలయ్య సంతాపం…
మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఓ మహిళ విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల దృష్టికి తీసుకెళ్లారు..
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవలే యజమాని భార్యను, కొడుకును పని మనిషి ఘోరంగా చంపేశాడు. కేవలం తిట్టారన్న కోపంతో నిందితుడు ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను మరువక ముందే తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. మహిళ, ఆరు నెలల శిశువు దారుణ హత్యకు గురయ్యారు.
నరసరావుపేటలో ఓ యువతి కడుపులో నుంచి పెన్నులు బయటకు తీశారు వైద్యులు.. నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో ఆస్పత్రికి చేరిన యువతకి.. అనుమాతంలో సిటీ స్కాన్ చేశారు వైద్యులు.. దీంతో, కడుపులో పెన్నులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
రాజధాని నిర్మాణానికి దాతల నుంచి విరాళాలు వస్తున్నాయి.. రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయం అందించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు.. 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మీ 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.
చిత్తూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు రూరల్ చెర్లోపల్లిలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 12వ తేదీన ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉన్న సరోజ అనే మహిళది సహజ మరణంగా భావించారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, సరోజ కొడుకు కన్నన్ కు ఒక బాలుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరా…
Karnataka: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ చేయగా.. అది కాస్త బెడిసి కొట్టింది. భర్త అలర్ట్ కావడంతో ఆ ఫ్యామిలీ బతికి బట్ట కట్టింది.
కూకట్ పల్లి అంకుర హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్ సంధ్యకు చేధు అనుభవం ఎదురైంది. నిజంపేటకు చెందిన సంధ్య డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ట్విన్స్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత MICU కి షిఫ్ట్ చేశారు. కాసేపటికే బాలింతకు చలి తీవ్రత పెరగడంతో కాళ్లకు హీట్ ప్యాడ్స్ కట్టారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది హీట్ ప్యాడ్స్ ను తీసేయడం మర్చిపోయారు.…
మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఓ వ్యక్తి.. ఈ సమయంలో.. సదరు మహిళ కూతురుపై కన్నేశాడు.. దీంతో, నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ ఆమెను వేధించసాగాడు.. మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెన తనకిచ్చి పెళ్లి చేయాలని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బాధితురాలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి పట్ల కర్కశంగా వ్యవహరించింది ఓ కూతురు. తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి హత్య చేయించందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటలో మహిళ కిడ్నాప్ అనంతరం మర్డర్ కు గురైంది. బహిర్భూమికి వెళ్లిన తల్లి కూతుర్లలో తల్లిని ఆటోలో వచ్చిన కూతురు ప్రియుడు ఎత్తుకెళ్లాడు. పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. Also Read:Top Hedlines @1PM…