Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
- ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమి
- రోహిత్ శర్మ 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్
- మ్యాచ్‌కు ముందు రోహిత్ భవిష్యత్తుపై ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill Ends Rohit Sharma’s Retirement Speculation: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత శతకంతో మరోసారి తన క్లాస్ బ్యాటింగ్‌ను చూపించాడు. 39 ఏళ్ల హిట్‌మ్యాన్ 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అయితే అతని పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 360/7కే పరిమితమై.. 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది.
రోహిత్ భవిష్యత్తుపై ఊహాగానాలు:
ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఊహాగానాలు వినిపించాయి. ప్రపంచ కప్ 2027 కోసం సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం కొత్త ప్రణాళికలపై దృష్టి సారిస్తున్నారని.. లార్డ్స్ మ్యాచ్ రోహిత్‌కు చివరిదని ప్రచారం జరిగింది. ఈ వార్తలు, ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా 110 బంతుల్లో 138 పరుగులు చేసి మరోసారి తన విలువేంటో చాటి చెప్పాడు. హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. లార్డ్స్ మైదానంలో భారత బ్యాటర్‌గా శతకం నమోదు చేసిన తొలి ఆటగాడిగా కూడా రోహిత్ చరిత్ర సృష్టించాడు. రోహిత్‌కు శుభ్‌మన్ గిల్ (77), విరాట్ కోహ్లీ (74) మంచి సహకారం అందించారు. గిల్‌తో 147 పరుగుల భాగస్వామ్యం, కోహ్లీతో 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు విజయంపై ఆశలు కల్పించాడు. అయితే చివరి ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ లక్ష్యానికి చేరుకోలేకపోయింది.
Also Read
- Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
రోహిత్ భాయ్ మాతో ఏమీ చెప్పలేదు:
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై వచ్చిన వార్తల గురించి భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను రిపోర్టర్స్ ప్రశ్నించారు. దీనిపై గిల్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ‘అందంతా ఏమీ లేదు. లార్డ్స్ వన్డే తనకు చివరిదని రోహిత్ భాయ్ మాతో చెప్పలేదు. అలాంటి వార్తలు మీడియాలో మాత్రమే వస్తున్నాయి. అది చూసి మేము నవ్వుకున్నాం. రోహిత్ టీమిండియా కోసం ఇంకా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని తెలిపాడు. వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడడం తన టార్గెట్ అని హిట్‌మ్యాన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఓ ప్లేయర్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తేనే సంతోషంగా ఉంటాడు అని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. రోహిత్ మెగా టోర్నీ వరకు వరకు ఆడడం ఖాయం.
2027 ప్రపంచ కప్ వరకు:
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు చేసిన సేవలను గిల్ ప్రశంసించాడు. ‘రోహిత్, కోహ్లీలు ఎన్నో సంవత్సరాలుగా భారత జట్టుకు అద్భుత సేవలు అందించారు. ఈ రోజు రోహిత్ భాయ్ 140కి చేరువగా ఆడిన ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం. చివర్లో పిచ్ నెమ్మదిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో అంత భారీ స్కోరు చేయడం అసాధారణం’ అని కొనియాడాడు. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు ఇంగ్లండ్‌లో చివరి వన్డే అయ్యే అవకాశమున్నప్పటికీ.. అతని ఆటతీరు మాత్రం ఇంకా తనలో ఎంతో క్రికెట్ మిగిలి ఉందనే సంకేతాలు ఇచ్చింది. సిరీస్‌ను భారత్ కోల్పోయినా.. రోహిత్, కోహ్లీలు 2027 ప్రపంచ కప్ వరకు భారత జట్టులో కొనసాగుతారనే అభిప్రాయం మరింత బలపడింది. లార్డ్స్‌లో రోహిత్ ఆడిన ఈ పోరాట శతకం చాలా కాలం పాటు అభిమానుల మదిలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌గా గుర్తుండిపోతుంది.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!