బాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే నిందితులపై పోలీసులు పోక్సో కేసులు నమోదు చేస్తుంటారు. తాజాగా ఓ మహిళపై పోక్సో కేసు నమోదైంది. మహిళపై పోక్సో కేసు నమోదవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు విషయానికి వస్తే.. ఓ మహిళ మైనర్ బాలుడితో సంబంధం పెట్టుకుని అతడిని తీసుకుని పారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో మహిళ పై పోక్సో కేస్ నమోదు చేశారు పోలీసులు. మహిళ తన భర్తతో విడాకులు తీసుకుని ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన బాలుడి(17)తో ప్రేమాయణం కొనసాగించి.. అతడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.