పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు, సహజీవనాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. కుటుంబాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన భార్యతో గొడవపడుతుందని తనతో సహజీవనం చేస్తున్న మహిళను అంతమొందించాడు ఓ ప్రియుడు. కొనిజర్ల మండలం విక్రమ్ నగర్ లో భార్యతో గొడవ పడుతుందని సహజీవనం చేస్తున్న మహిళను లక్ష రూపాయలు సుపారి ఇచ్చి ప్రియురాలిని హత్య చేయించాడు.
Also Read:NBK : బి. సరోజా దేవి మృతి పట్ల బాలయ్య సంతాపం
సహజీవనం చేస్తున్న మహిళ హస్లికు మాయ మాటలు చెప్పి, సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టారం అటవీ ప్రాంతంలో హత్య చేశాడు భూక్య మదన్. కొన్ని రోజులుగా మహిళ అదృశ్యం కావడంతో ఆమె కూతురు ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో కొనిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మృతురాలి కుమార్తె. కేసు నమోదు చేసిన పోలీసులు రెండ్రోజుల్లో కేసును చేదించి నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు ఏసీపీ రహమాన్ సీఐ సాగర్, ఎస్సై సూరజ్ తెలిపారు.