దేశంలో మహిళల అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడొక చోట కట్టుకున్నవాళ్లను కాటికి పంపేస్తున్నారు. కొందరు ప్రియుడితో సుఖం కోసం భాగస్వాములను చంపేస్తుంటే.. ఇంకొందరు ఆయా కారణాల చేత అంతమొందిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం వెలుగు చూసింది. భర్త లైంగిక సంతృప్తి ఇవ్వలేదని.. అత్యంత దారుణంగా చంపేసింది ఓ ఇల్లాలు. ఆలస్యంగా సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Supreme Court: జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు
మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్ (29) భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఇర్ఫాన్‌ను ఫర్జానా ఖాన్ తీసుకొచ్చింది. వైద్యులు పరిశీలించగా శరీరంపై తీవ్రమైన గాయాలు కనిపించాయి. దీంతో డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి వచ్చిన పోలీసులు.. ఇర్ఫాన్ పరిశీలించగా లోతైన గాయాలు కనిపించాయి. దీంతో భార్యను విచారించగా ఆత్మహత్య చేసుకున్నాడని అబద్ధం చెప్పింది. అనుమానంతో ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని పరిశీలించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరిగి ఆమెను లోతుగా విచారించగా నేరాన్ని అంగీకరించింది. లైంగిక సంతృప్తినివ్వడం లేదనే తాను చంపేసినట్లుగా ఒప్పుకుంది.
ఇది కూడా చదవండి: India-Pakistan: అప్పుల కోసం పరుగులు పెడుతోంది.. యూఎన్‌లో పాక్‌పై భారత్ వ్యంగ్యాస్త్రాలు
ఇక ఆమె మొబైల్‌లో అనేక విషయాలు శోధించిన దృశ్యాలు హిస్టరీలో కనిపించాయి. వాట్సాప్ చాట్‌లను ఎలా తొలగించాలో కూడా శోధించినట్లు కనిపించింది. ఎలా అంతమొందించాలో బాగా సెర్చ్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. భర్త లైంగిక సంతృప్తి ఇవ్వడం లేదన్న కారణంతోనే భర్తను భార్య చంపేసిందని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులకు నిందితురాలు అబద్ధం చెప్పిందని వెల్లడించారు. శరీరంపై మూడు లోతైన గాయాలు ఉన్నాయన్నారు. ఒకటి గుండెను చీల్చుకుంటూ వెళ్లిందన్నారు. ప్రేగులపై అనేక గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేరం వెనుక మరేదైనా కారణం ఉందా అని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.