Pawan Kalyan: సమస్య అంటూ తన దగ్గరకు వచ్చినా.. సాయం అంటూ విజ్ఞప్తి చేసినా.. వెంటనే స్పందించేవాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరు.. ఇప్పుడు, మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఓ మహిళ విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల దృష్టికి తీసుకెళ్లారు..
Read Also: Senior Actress : సౌత్ ఇండస్ట్రీపై కన్నేసిన ఆ తల్లికూతుళ్లు
ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసింది ఓ మహిళ.. ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ పవన్ కల్యాణ్ ను కోరారు గండబోయిన సూర్యకుమారి అనే మహిళ.. విజయనగరానికి చెందిన ఆమె– మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని కోరారు.. తమ ఇద్దరు కుమారులతోపాటు 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్టు డిప్యూటీ సీఎంకు వివరించారు.. దీనిపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.. యువకులను విడిపించేందుకు తన వంతు సాయం చేస్తానని ఆ మహిళకు తెలిపారు పవన్ కల్యాణ్..