కొందరి పోలీసుల ప్రవర్తన పవిత్రమైన, బాధ్యతకలిగిన వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. బాధితుకు న్యాయం చేకూరాల్సిందిపోయి.. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ముదిగుబ్బ మండలంలోని పట్నం స్టేషన్ ఎస్సై రాజశేఖర్ ఓ మహిళను లైంగికంగా వేధించాడు. తన కోరిక తీరిస్తే కేసులో న్యాయం చేస్తానని, లేకపోతే ఇబ్బందులు తప్పవని ఓ గిరిజన మహిళను బెదిరించాడు. గరుగుతండాకు చెందిన ఓ మహిళ తమ బంధువులతో కలిసి విడాకుల కేసు విషయంపై రెండు నెలల కిందట పోలీసులను ఆశ్రయించింది.
Also Read:Team india Cricketers: మీరు హద్దు దాటొద్దు.. ప్రమాదం తెచ్చుకోవద్దు!
అప్పటి నుంచి కేసు విషయంలో ఎస్సై ఆమెను వేధించేవాడు. బాధిత మహిళ భర్త ప్రైవేట్ టీచర్‌గా వేరే ప్రాంతంలో పని చేస్తారు. రాత్రివేళల్లో ఎస్సై ఆమెకు వీడియోకాల్ చేసి బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించేవాడు. సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ఎస్సై రాజశేఖర్ వీడియో. దీనిపై స్పందించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఎస్సై రాజశేఖర్ ను వీఆర్ కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.