తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది.
చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. కాగా.. పొగమంచు పగబడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ఈ సీజన్‌లో కురిసే మంచు కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు నవంబరు, డిసెంబరు, జనవరిల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు కూడా చలికాలంలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఈ టిప్స్ పాటించండి.
Delhi : వాతావరణంలో నిరంతర మార్పులు కనిపిస్తున్నాయి. పర్వతాలపై తాజా హిమపాతం శీతాకాలం ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలో తగ్గుదల కనిపించింది.
శీతాకాలం మొదలైంది. చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చలికాలం అనేక సీజనల్ వ్యాధులను తెస్తుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ.. అనేక ఇతర సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి.
Char Dham Yatra: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్‌ధామ్ యాత్ర చివరి దశకు చేరుకుంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు క్లోజ్ చేయనుండగా.. ఆ తర్వాత ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనాన్ని కొనసాగిస్తారు.
చలికాలం ప్రారంభం కానుంది. చలి ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవడానికి చాలా మంది చ్యవాన్‌ప్రాష్‌ని తీసుకుంటారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన అనేక చ్యవన్‌ప్రాష్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
దేశం మొత్తానికి రుతుపవనాలు వీడ్కోలు పలకబోతున్నాయి. అక్టోబర్ 15 నాటికి రుతుపవనాలు పూర్తిగా కనుమరుగవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఐఎండీ ప్రకారం, ఈ సంవత్సరం దేశంలో సాధారణం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని కూడా వాతావరణ శాఖ చెబుతోంది.
చలికాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల మన శరీరంలో జరిగే మార్పుల వల్ల ఇది సాధారణంగా జరుగుతుంది. చలి కారణంగా, శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి మన ధమనులు సంకోచించబడతాయి, దీనిని వాసోకాన్స్ట్రిక్షన్ అంటారు. దీని కారణంగా రక్త ప్రసరణలో సమస్యలు ఉండవచ్చు
Telangana Weather: తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఒక్కసారిగా చలిగాలులు వీచాయి. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Weather Forecast : పర్వతాలలో నిరంతరాయంగా కురుస్తున్న మంచు ప్రభావం ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఉదయం, రాత్రి పాదరసం నిరంతరం పడిపోతుండగా మధ్యాహ్నం సూర్యుడు మండిపోతున్నాడు.