చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. కాగా.. పొగమంచు పగబడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ఈ సీజన్‌లో కురిసే మంచు కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు నవంబరు, డిసెంబరు, జనవరిల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు కూడా చలికాలంలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఈ టిప్స్ పాటించండి.
READ MORE: Mutton Curry: మటన్ ముక్కల కోసం కొట్లాట.. బీజేపీ ఎంపీ విందులో ఘటన..
రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఉంచాల్సి వస్తే ఇతరులు ప్రమాదాలకు గురవకుండా హెచ్చరిక లైట్లు వేసి ఉంచాలి. రేడియం స్టిక్కర్లు కనిపించేలా ఏర్పాటు చేయాలి. మంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనాదారులకు రవాణాశాఖ అధికారులు ఇచ్చిన సూచనలు పాటించాలి. సొంత కార్లు, ద్విచక్రవాహనాలపై అర్ధరాత్రి, తెల్లవారుజాముల ప్రయాణాలు వీలైనంత మేర తగ్గించుకోవాలి. ఉదయం 8గంటలు దాటిన తర్వాత సొంత వాహనాల్లో ప్రయాణాలు ప్రారంభించాలి. మంచు పడుతున్నప్పుడు ఫాగ్‌లైట్స్ తప్పనిసరిగా ఉపయోగించాలి. కొన్ని సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించవు. అలాంటప్పుడు అతివేగంతో వాహనం అస్సలు నడపకూడదు. ఒక్కోసారి రోడ్డుపై వాహనం జారిపడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
పరిమిత వేగంలో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే కనీసం 50 అడుగుల దూరంలో వాహనం ఆగుతుంది. అతి వేకంగా ఉన్నప్పుడు 90 అడుగుల దారంలో నిలుస్తాయి. అకస్మాత్తుగా బ్రేకలు వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి సాధారణ వేగంలోనే వీలైనంత వరకు వాహనాలు నడపాలి. అప్పుడే నియంత్రణ సాధ్యమవుతుంది. కారులో వెళ్లేటప్పుడు హీటర్ ఉపయోగించాలి. దీనివల్ల ముందు అద్దాలు ఆవిరిపట్టకుండా ఎదుటి వాహనాలను సరిగ్గా గమనించేందుకు వీలు ఉంటుంది.
READ MORE:IND vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన భారత్.. మ్యాచ్ సమం అవుతుందా?