చలికాలంలో మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? ఒక పక్క సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతూ.. ఆహారం తినడానికి ఇష్టపడరు. చలికాలంలో జలుగు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి సమయంలో పిల్లలకు క్యారెట్‌తో తయారు చేసిన వంటకం ఆరోగ్య పరంగా మంచిది. ఇది రుచితో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
చలికాలంలో చర్మం తరచుగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అలా అని బాధపడాల్సిన అవసం లేదు. ఎందుకంటే బీట్‌రూట్ మీ చర్మానికి అద్భుతంగా పని చేస్తుంది. బీట్‌రూట్ ఆరోగ్యంతో పాటు మీ అందాన్ని కూడా పని చేస్తుంది. ఇంట్లోనే బీట్‌రూట్ బ్లష్‌ను తయారు చేసుకుని వాడటం వల్ల మీ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు సహజ యాంటీబయాటిక్.. ఇది గాయాలను నయం చేయడంలో, సంక్రమణను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
Winter Care Tips: ఈ ఏడాది చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. చలి గాలులు అనేక రకాల వ్యాధులకు కారణం అవుతున్నాయి. ఈ సీజన్‌లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి బాగా తగ్గుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం జుట్టు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. జుట్టు రాలడం, చుండ్రు, దురద, జుట్టు పల్చబడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. శీతాకాలంలో తగ్గుతున్న ఊష్ణోగ్రతల కారణంగా.. వేడి నీటితో తల స్నానం చేస్తుంటారు. అలా చేస్తే జుట్టుకు…
చలికాలంలో రోగనిరోధక పెరుగుతోంది. మారుతున్న వాతావరణంతో జలుబు, జ్వరం రావడం సాధారణ విషయం. చలికాలంలో చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. జ్వరానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాతావరణంలో మార్పు, విపరీతమైన చలి కారణంగా ఫీవర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. జ్వరం ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులను సంప్రదించి అనేక రకాల మందులు వాడుతున్నారు. అయితే కొన్ని హోం రెమెడీస్ సహాయంతో మీరు జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చలికాలం ప్రారంభమైంది. రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. చలి కారణంగా.. చేతులు, ముఖం కడుక్కోవడానికి, స్నానానికి గీజర్లు వాడుతున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ గీజర్లతో పాటు ఎల్‌పీజీ గీజర్ల వాడకం కూడా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గీజర్ల వల్ల ప్రమాదాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. స్నానం చేస్తూ స్పృహతప్పి పడిపోవడంతో పాటు పలు ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రీజర్‌లు వాడేవాళ్లు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.
చలికాలంలో కండరాలు, ఎముకల్లో నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరం యొక్క కండరాలు, సిరలలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ క్రమంలో.. సిరల్లో నొప్పి, వాపు సమస్యలు ఏర్పడతాయి. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా నరాల నొప్పి వస్తుంది. నేషనల్ హార్ట్, లంగ్స్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. విటమిన్ B12 శరీరానికి అవసరమైన విటమిన్.. ఈ విటమిన్ లోపం వల్ల చేతులు, కాళ్ళ నరాలలో నొప్పిని కలిగిస్తుంది.
చలికాలంలో చర్మాన్ని, శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. అంతే జాగ్రత్తగా జుట్టుపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. చల్లటి గాలి, తక్కువ తేమ, తరచుగా వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సహజ తేమను, మెరుపును కోల్పోతుంది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో విషపూరితమైన గాలి కారణంగా ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది. అయితే గత కొంత కాలంగా ఏటా చలికాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోంది. చల్ల గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు వంటి కాలానుగుణ వాతావరణ పరిస్థితులు ఏటా ఈ సమయంలో ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యాన్ని పెంచుతాయి.