చలికాలంలో కండరాలు, ఎముకల్లో నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరం యొక్క కండరాలు, సిరలలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ క్రమంలో.. సిరల్లో నొప్పి, వాపు సమస్యలు ఏర్పడతాయి. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా నరాల నొప్పి వస్తుంది. నేషనల్ హార్ట్, లంగ్స్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. విటమిన్ B12 శరీరానికి అవసరమైన విటమిన్.. ఈ విటమిన్ లోపం వల్ల చేతులు, కాళ్ళ నరాలలో నొప్పిని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఎర్ర కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లను తయారు చేయడానికి శరీరానికి విటమిన్ B12 అవసరం. అయితే.. మన శరీరం ఈ విటమిన్‌ను స్వయంగా తయారు చేసుకోలేకదు.. ఈ క్రమంలో ఆహారం ద్వారా భర్తీ చేయాలి. శరీరంలో విటమిన్ B12 లోపాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.
Read Also: Mumbai: నాన్ వెజ్ కోసం ప్రియుడితో ఘర్షణ.. సీఎంతో సత్కారం పొందిన మహిళా పైలట్ మృతి!
మాంసాహారం తినాలి:
విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో మాంసం, చేపలను తీసుకోండి. విటమిన్ B12 అనేది నీటిలో కరిగే విటమిన్.. ఇది ముఖ్యంగా జంతువుల ఆహారాలలో ఉంటుంది. రక్త ఉత్పత్తి, నాడీ వ్యవస్థ, డీఎన్ఏ ఏర్పడటానికి ఈ విటమిన్ అవసరం. B12 లోపాన్ని అధిగమించడానికి.. మీ ఆహారంలో చికెన్, బీఫ్, మటన్, సాల్మన్, ట్రౌట్, ట్యూనా, గుడ్లు, చేపలను తీసుకోవాలి.
పాలు, పాల ఉత్పత్తులను తీసుకోండి:
శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి మీ ఆహారంలో పాలు, జున్ను, పెరుగు, వెన్న తీసుకోవాలి. ఈ ఆహారాలు శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని తీరుస్తాయి.
శాఖాహార ఆహారాల్లో విటమిన్ B12:
శరీరంలో విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి విటమిన్ B12 అధికంగా ఉండే తృణధాన్యాలు తీసుకోవాలి. సోయా, బాదం లేదా వోట్ పాలు వంటివి తినండి. శాకాహారులకు పోషకాహార ఈస్ట్ ఒక అద్భుతమైన మూలం.
బీట్‌రూట్ తినండి:
శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి ప్రతిరోజూ బీట్‌రూట్ తినాలి. ఇది దాదాపు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. బీట్‌రూట్ జ్యూస్‌ని తయారు చేసి సలాడ్‌గా తీసుకోవచ్చు.
పుట్టగొడుగులను తినండి:
పుట్టగొడుగులను చలికాలంలో తింటే శరీరంలో విటమిన్ డి, విటమిన్ బి12 లోపాన్ని తీరుస్తుంది. ఈ రెండు విటమిన్లు శరీరానికి అవసరం. ఇది నరాల బలహీనతను తొలగిస్తుంది. మీరు పుట్టగొడుగులను దాని సూప్, జ్యూస్ తయారు చేయడం ద్వారా తినవచ్చు.