పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు సహజ యాంటీబయాటిక్.. ఇది గాయాలను నయం చేయడంలో, సంక్రమణను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. పసుపు ఆర్థరైటిస్, ఆస్తమా, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. పసుపులో యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి.
శీతాకాలంలో వచ్చే జలుబును నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది.. అలాగే కండరాల నొప్పి నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. పసుపు చర్మానికి, జీర్ణక్రియకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే పసుపును సరైన పద్ధతిలో తీసుకోవాలి. చలికాలంలో పసుపును ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.
Andhra Pradesh: విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
పసుపు పాలు:
శీతాకాలంలో చాలా మంది పసుపు పాలను తాగుతుంటారు. వేడి పాలలో ఒక టీస్పూన్ పసుపు కలపండి. తీపి కోసం మీరు చిటికెడు చక్కెర, కొద్దిగా తేనె లేదా బెల్లం వేసుకోవచ్చు. ఈ పానీయం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. మంచి నిద్రను అందిస్తుంది. అలాగే.. జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
టర్మరిక్ టీ:
టర్మరిక్ టీ అనేది పసుపు పొడి లేదా పసుపు ముద్దలను నీటిలో మరిగించి తయారు చేసిన వేడి పానీయం. అల్లం, తేనెను రుచి కోసం వేస్తారు. ఈ ఔషధ టీ శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. శరీరానికి శక్తినిస్తుంది. వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
పసుపు తేనె:
తేనెలో పసుపు పొడిని కలిపి ఒక జాడీలో ఉంచండి. రోజూ ఒక చెంచా పసుపు తేనెను తినండి. శీతాకాలపు సమస్యలైన గొంతునొప్పి, దగ్గు, కాలానుగుణంగా వచ్చే అలర్జీలకు ఇది సహజ ఔషధం.
పసుపు అధికంగా ఉండే సూప్:
మీకు ఇష్టమైన సూప్‌లో చిటికెడు పసుపు కలిపి తినండి. ఆ సూప్ పోషక విలువలను పెంచుతుంది. శీతాకాలంలో ఇలా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
నోట్ : ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.