Karnataka: మాజీ డీజీపీ హత్య వెనుక మిస్టరీ ఇదే..!
- వీడుతున్న కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య మిస్టరీ
- భార్య, కుమార్తెనే చంపినట్లుగా గుర్తించిన పోలీసులు
- ఆస్తి తగాదాల నేపథ్యంలోనే హత్యకు గురైనట్లుగా నిర్ధారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం పోలీసులు సంఘటనాస్థలికి చేరుకోగానే ఓం ప్రకాష్ రక్తపుమడుగులో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్య పల్లవి.. కుమార్తె చంపినట్లుగా పోలీసులు తేల్చారు.
ఇది కూడా చదవండి: Rythu Mahotsavam 2025: నేటి నుంచి రైతు మహోత్సవం.. 5 జిల్లాల నుంచి తరలిరానున్న రైతులు!
Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ఈ మధ్య కాలంలో ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే చావుబతుకుల మధ్య రక్తపుమడుగులో ఉన్నప్పుడు తనను కాపాడాలంటూ 15 నిమిషాలు ఓం ప్రకాష్ వేడుకున్నారు. కానీ భార్య, కుమార్తె ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు. ఇక ఘటనాస్థలిలో రెండు కత్తులు, ఒక బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశాక.. ఘటనాస్థలిలో కారం పొడి చల్లేశారు. ఆయుధాలపై కూడా కారం చల్లారు.
ఇది కూడా చదవండి: MP: ఆస్పత్రిలో అమానుషం.. వృద్ధ పేషెంట్‌ను ఈడ్చికెళ్లిన సిబ్బంది. వైద్యులు సస్పెండ్
ఇక ఓం ప్రకాష్‌ను చంపేశాక.. ఆ రాక్షసుడిని చంపేశానంటూ భార్య పల్లవి విల్లా బయటకు వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేసింది. దీంతో అక్కడ వారంతా షాక్‌కు గురయ్యారు. గత వారం రోజులుగా ఆస్తి గొడవలు ఎక్కువైనట్లుగా తెలుస్తోంది. 3 రోజుల క్రితం ఓం ప్రకాష్ భార్య పల్లవి ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో పెట్టిన మెసేజ్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇంట్లో భర్త తుపాకీతో తిరుగుతున్నాడని.. తనను, కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడని మెసేజ్‌లో వాపోయింది. భర్తపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. కానీ ఇంతలోనే ఓం ప్రకాష్ హత్యకు గురయ్యాడు.

ఇక ఓం ప్రకాష్‌ను చంపేశాక భార్యనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని నివాసానికి పోలీసులు వచ్చారు. చాలా సేపు డోర్లు ఓపెన్ చేయలేదు. మొత్తానికి లోపలికి వెళ్లి చూడగా హత్యకు గురైనట్లుగా గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు.
ఇది కూడా చదవండి: Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
ఓం ప్రకాష్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని చంపారన్. 1981 బ్యాచ్ ఐపీఎస్ అయిన ఈయన బళ్లారిలోని హరపనహళ్లీలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్క మగళూర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆయన తన సర్వీసులో కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ, లోకాయుక్తలో పదవులు, అగ్నిమాపక సేవల డీఐజీ, సీఐడీ ఐజీపీ వంటి కీలక పదవులను నిర్వహించారు. 1993 భత్కర్ మత అల్లర్లలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2015లో డీజీపీ అండ్ ఐజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో పదవీ విరమణ చేశారు.
తాజావార్తలు
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!