Marriage: స్త్రీ ఏదైనా పంచుకోవడానికి ఇష్టపడుతుంది, తన భర్తను పంచుకోవడానికి ఇష్టపడదు. అంతెందుకు.. ఏ పరాయి స్త్రీ అయినా తన భర్త వైపు చూస్తే ఊరుకోదు. భర్త ఎవరితోనైనా క్లోజ్ గామాట్లాడినా తట్టుకోలేదు. అలాంటిది ఓ మహిళ... తనలో సభభాగమైన భర్తను ఎంతో ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది.
కూర నచ్చలేదని భార్యను సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బండాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆదివారం రోజు భార్యపై గొడవకు దిగాడు. అంతేకాకుండా దారుణంగా చితకబాదిన భర్త.. అనంతరం భార్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు.
ఇన్స్టాగ్రామ్ ఒకరి ప్రాణం తీసింది. యూపీలోని లక్నోకు చెందిన ఓ వ్యాపారవేత్త తన భార్యను తానే హత్య చేశాడు. ఆదివారం పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన వారు.. కారులోనే గొడవపడ్డారు. ఆ తర్వాత తన పిల్లల ఎదుటే భార్యను హతం చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారని.. అంతేకాకుండా ఆమె తన భర్తను ఇన్స్టాలో బ్లాక్ చేసిందని పేర్కొన్నారు.
చదివించి లెక్చరర్ చేస్తే.. కాళ్లను విరగ్గొట్టించింది ఓ భార్య. తనకు చదువు రాకుండా.. తన భార్య చదువుకుంటానంటే కష్టపడి చదివిస్తే.. చివరకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బండాలో జరిగింది. తాను చదువుకునేందుకు మద్ధతిచ్చానని.. కానీ తన భార్య దాడి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు భర్త.
సాధారణంగా భర్తను తమ పంచప్రాణాలుగా భావిస్తుంటారు భార్యలు. భర్తకు చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే విలవిలలాడిపోతూ ఉంటారు. అలాంటిది ఓ భార్య తన భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. దొరకకుండా ఉండటం కోసం అతనికి కొంతకాలంగా కాఫీలో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని కలిపి ఇచ్చింది. ఇది గమనించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాల ప్రకారం మెలోడీ ఫెలికానో జాన్సన్, రాబీ జాన్సన్…
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపేశారు. జిల్లాలోని రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం కృష్ణ హత్యకు గురయ్యాడు.
విశాఖలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలిగా పోలీసులు నిర్ధారించారు. ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.