Bombay High Court: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో విడాకులు కోరకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: తన జీవిత భాగస్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఏ వ్యక్తి విడాకులు కోరకూడదని బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో పేర్కొంది. తన భార్య మూర్ఛ వ్యాధితో బాధపడుతోందని, తనకు నయంకాని వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్న వ్యక్తికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన 2016 ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ ఎస్‌ఏ మెనెజెస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మూర్ఛ వ్యాధి కారణంగా తన భార్య అసాధారణంగా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని, దీంతో వివాహబంధం విచ్ఛిన్నమైందని భర్త ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలతో హైకోర్టు ఏకీభవించలేదు. ‘మూర్ఛ వ్యాధి’ అనేది నయం చేయలేని వ్యాధి కాదు, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(iii) ప్రకారం దీనిని మానసిక రుగ్మతగా పరిగణించలేమని న్యాయమూర్తులు తెలిపారు.
Also Read: Birhor Community: చెల్లెలికి అమ్మగా మారిన ఐదేళ్ల బాలిక.. ఈ అడవి బిడ్డల దీనగాథ కంటతడి పెట్టిస్తోంది!
Also Read
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఈ విషయంలో బెంచ్ రఘునాథ్ గోపాల్ దఫ్తార్దార్ వర్సెస్ విజయ రఘునాథ్ దఫ్తార్దార్ కేసులో సింగిల్ జడ్జి పరిశీలనలపై ఆధారపడింది.ఇది ఇలాంటి కేసు కానప్పటికీ, ప్రస్తుత కేసుకు వర్తించే రీజనింగ్‌ను ఇచ్చామని డివిజన్ బెంచ్ తెలిపింది. భార్యాభర్తలు కలిసి జీవించడానికి ఇలాంటి వైద్య పరిస్థితి అడ్డంకి కాదనేదానికి పుష్కలమైన వైద్య ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.”తదనుగుణంగా భార్య మూర్ఛ వ్యాధితో బాధపడుతుందని నిరూపించడంలో భర్త విఫలమయ్యాడని లేదా ఆమె అలాంటి పరిస్థితితో బాధపడుతుంటే, విడాకుల డిక్రీని క్లెయిమ్ చేయడంలో సెక్షన్ 13(1)(iii) చట్టం ప్రకారం పరిగణించవచ్చు.” అని ధర్మాసనం వెల్లడించింది.
Also Read: Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. పిల్లలు ఆడుకుంటుండగా ఘటన..
వైద్యపరమైన ఆధారాల ప్రకారం మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ప్రతి వ్యక్తి సాధారణ జీవితాన్ని గడపవచ్చని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో ఉన్న మహిళ మూర్ఛ వ్యాధితో బాధపడలేదని వైద్య ఆధారాలు సూచిస్తున్నాయి. “అలాంటి వైద్య పరిస్థితి భార్యాభర్తలు కలిసి జీవించడానికి అవరోధంగా ఉంటుందని పిటిషనర్ వైఖరిని సమర్థించలేమని, వైద్యపరమైన ఆధారాలు పుష్కలంగా ఉన్నాయని మేము అభిప్రాయపడుతున్నాము” అని కోర్టు పేర్కొంది. భర్త తరపున న్యాయవాది విశ్వదీప్ మేటి వాదనలు వినిపించారు. భార్య తరఫు న్యాయవాది జ్యోతి ధర్మాధికారి వాదించారు.
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!