AP Crime: మంగళ సూత్రం ఏమైందని అడిగిన భర్తపై దారుణంగా కొడవలితో దాడి చేసింది భార్య.. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం సృష్టించింది.. జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లి మండలంలో పెంచుపాడు పంచాయతీ కట్టుబావి గొల్లపల్లిలో దివ్యాంగుడైన భర్త వెంకటరమణతో కలిసి నివాసం ఉంటుంది భార్య మంగమ్మ.. అయితే, ఏమైందేమో తెలియదు కానీ.. భార్య మెడలో ఉండాల్సిన మంగళ సూత్రం కనిపించలేదు.. దీంతో.. మంగళ సూత్రం ఏమైందని భార్యను నిలదీశాడు భర్త వెంకటరణ.. దీంతో.. భార్యాభర్తల మధ్య మాటామాట పెరిగింది.. అసులు నీకు ఎందుకు సమాధానం చెప్పాలని ఎదురు తిరిగింది భార్య.. దీంతో.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. ఆగ్రహంతో దివ్యాంగుడైన భర్తపై భార్య కొడవలితో దాడికి పాల్పడింది. వెంకటరమణకు తీవ్రగాయాలు అయినట్టుగా తెలుస్తోంది.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Swachhata Hi Sewa: కొనసాగుతున్న స్వచ్ఛతా హి సేవా ప్రచారం..