Monkey Pox: ఫ్రాన్స్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. ఒక్కరోజులోనే 51 కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంకీపాక్స్ వైరస్ కలకలంరేపుతోంది. ఇప్పటికే దాదాపు 50కి పైగా దేశాలకు విస్తరించింది. సుమారు 700 కిపైగా కేసులు బయట పడ్డాయి. మంకీపాక్స్ పేరు వినగా ప్రజలంతా జంకిపోతున్నారు. ఇక ఈవైరస్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్ దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో వెలుగు చూసింది.
వైరస్ బాధితులంతా మగవారేనని, అందులోనూ 22 నుంచి 63 ఏండ్ల వయస్కులని ఫ్రెంచ్ నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే దవాఖానలో చికిత్స తీసుకుని కోలుకున్నారని ప్రకటించింది. దీంతో వయోజనులంతా వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది మంకీపాక్స్ బారిన పడ్డారని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. తమ దేశంలో 21 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అయితే ఈ వ్యాధి సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!