కరోనా రక్కసి ఇంకా సమసిపోలేదని.. మార్పు చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్వో) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
కరోనా మహమ్మారి మార్పు చెందుతోందని.. ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్వో అధినేత టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు. కొత్త కేసులు రిపోర్టింగ్ , జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలు తగ్గి పోవడం వల్ల వైరస్ ను ట్రాక్ చేయగల సామర్థ్యం ప్రమాదంలో ఉందన్నారు. దాంతో భవిష్యత్ వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారుతోందన్నారు. సబ్ వేరియంట్ల కారణంగా 110 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు.
అన్ని దేశాలూ తమ జనాభాలో 70 శాతం మందికి టీకా వేయాలని తాము సూచించినట్లు టెడ్రోస్ తెలిపారు. కానీ అల్పాదాయ దేశాల్లో మాత్రం ఇంకా అర్హులకు టీకాలు అందడం లేదన్నారు. 58 దేశాలు మాత్రమే 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయన్నారు. ఈ సమయంలో వైరస్ నిరంతర వ్యాప్తి గురించి ఆందోళనగా ఉందన్నారు. దాని వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.
భారత్ ఈ ఏడాది ప్రారంభంలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కాస్త ఆందోళనకు గురిచేసినా ప్రమాదకరంగా మాత్రం మారలేదు. ఆ తర్వాత వేవ్ తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ కొద్దిరోజులుగా కరోనా రక్కసి మళ్లీ వ్యాపిస్తోంది. తాజాగా 19 వేలకు కరోనా కేసులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలను చేపడుతున్నాయి.
James Webb Telescope: విశ్వంలోనే లోతైన ఫోటో.. జూలై 12 రిలీజ్