ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఒక పొరపాటు అని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. ఈ తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు అసెంబ్లీలో గత 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది.
అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సుమారు ఐదు నిమిషాల పాటు అమరావతి విధ్వంసంపై వీడియో రిలీజ్ చేశారు. కాగా.. వీడియో ప్లే అవుతున్నప్పుడు సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరావతి విధ్వంసం జరిగిన తీరు చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపారు. ఎంతో ఆలోచించి ప్రణాళికలు వేస్తే.. సర్వ నాశనం చేశారని ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే వారు అమరావతినే రాజధానిగా అంగీకరిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. కరుడు గట్టిన తీవ్రవాది కూడా అమరావతికే ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని అందరూ చెబుతున్నారని.. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని చంద్రబాబు తెలిపారు.