నేడు తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని NTPCలో 6వేల కోట్ల రూపాయలతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను తెలంగాణ ప్రజలకు ప్రధాని అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగించేలా నిర్మాణం చేశారు.…
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని స్కిల్ స్కామ్ అక్రమ అరెస్టులో న్యాయం కోరుతూ దీక్ష చేయనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరహార దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…
నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహియాత్ర ఆరంభం కానుంది. కృష్ణా జిల్లా నుంచి వారాహియాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ బహిరంగసభతో పవన్ వారాహియాత్ర ఆరంభం అవుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కలయికతో వారాహియాత్ర జరగనుంది. నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30కి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని రానున్నారు. మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేయనున్నారు. ఆపై మహబూబ్నగర్లో ర్యాలీలో ప్రధాని పాల్గొననున్నారు.…