నేడు ఖమ్మంలో వైఎస్‌ఆర్‌టీపీ నేత వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వైఎస్‌ఆర్‌టీపీ నియోజకవర్గాల బూత్ కమిటీల నియామకం కార్యక్రమంలో పాల్గొంటారు. రిటైర్డ్ రిటర్నింగ్ అధికారులతో ట్రైనింగ్ కార్యకర్తలతో సమావేశంకానున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టనున్న కార్యక్రమాలపై నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో…
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ 49వ రోజుకు చేరింది. నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు ములాఖత్ కానున్నారు. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన బాబు అరెస్టయిన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు ఉంది. నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి 3వ రోజు పర్యటన కొనసాగనుంది. టీడీపీ…
నేడు మేడిగడ్డకు కేంద్ర జలసంఘం సభ్యులు.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ పరిశీలన..
విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు నారా లోకేష్ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసే నిరసనల వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశాలపై అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు టీడీపీ…
స్కిల్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ 44వ రోజుకు చేరింది. గత నెల 9న అరెస్టైన చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకు కొనసాగనుంది. సెలవు దినాలు కావడంతో మూడు రోజులు ములాఖత్లు నిలిపివేయబడ్డాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. నేటి సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా…