* ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్: నేడు న్యూజిలాండ్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఢీ.. చెన్నై వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్
* ఏపీ, తెలంగాణ కృష్ణా జలలాల పంపిణీపై నేడు ట్రిబ్యునల్ విచారణ..
*నేడు మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. మొదట జడ్చర్ల, ఆ తర్వాత మేడ్చల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్న కేసీఆర్.. జడ్చర్ల పట్టణంలోని గంగాపూర్ రోడ్డు శివాలయం సమీపంలో సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు.. మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో సభకు ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.
* తెలంగాణకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు కాంగ్రెస్ బస్సు యాత్ర.. మూడు రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర.. మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు, చెరుకు రైతులతో రాహుల్ సమావేశాలు.. ఇవాళ ప్రత్యేక విమానంలో సాయంత్రం 3:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం చేరుకోనున్న రాహుల్, ప్రియాంక.. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో రామప్ప టెంపుల్ కు.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్, ప్రియాంక.. రామప్ప గుడి నుంచి ములుగు చేరుకోనున్న కాంగ్రెస్ బస్సు యాత్ర.. ములుగులో బహిరంగ సభ..
* ఢిల్లీ: నేడు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేయనున్న బీజేపీ.. సమావేశానికి హాజరుకానున్న లక్ష్మణ్
* ప్రకాశం : త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు.. బుధవారం – 4వ రోజు.. అలంకారం – శ్రీ కుష్మాoడదుర్గా దేవి.. పల్లకి సేవ – శేషవాహనం
* ప్రకాశం : శరన్నవరాత్రుల భాగంగా నాల్గవ రోజు మార్కాపురం లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు ధాన్య లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం.
* ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
* నెల్లూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనంతరం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు
* నెల్లూరు: వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ బస్సు యాత్ర కు సంబంధించి సన్నాహాక సమావేశం.. పాల్గొననున్న మంత్రి నేరుగా నాగార్జున..
* నెల్లూరు: జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం
* పశ్చిమగోదావరి జిల్లా: దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారు..
* పశ్చిమగోదావరి: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు
* విజయవాడ: ఇవాళ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మీ అవతారంలో దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మ.. మహాలక్ష్మీ దేవి దర్శనం సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి.. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు.. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, పాలకమండలి
* అనంతపురం : రేపు జిల్లాలో పర్యటించనున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
* అనంతపురం : గ్రీన్ టాక్స్ ను పెంచుతూ విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలంటూ ఏపీ ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా .
* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో 40వ రోజుకు చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. ఈనెల 19వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్
* తూర్పుగోదావరి జిల్లా : నేడు 4వ రోజు ఘనంగా జరుగుతున్న రాజమండ్రి దేవిచౌక్ లోని బాలత్రిపూర సుందరి శరన్నవరాత్రి వేడుకాలు.. బాలత్రిపూర సుందరీదేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.. తెల్లవారుజామున నుండి ప్రారంభమైన కుంకుమ పూజలు.. సామూహిక కుంకుమ పూజలకు భారీ హాజరైన మహిళలు.. భక్తిశ్రద్థలతో బాలత్రిపూర సుందరీదేవి దర్శించుకుంటున్న భక్తులు
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 5వరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనం.. కైలాసవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం
* నంద్యాల: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవ రాత్రి మహోత్సవాలు.. నేడు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న చౌడేశ్వరిదేవి అమ్మవారు
* తూర్పు గోదావరి: నేడు హోంమంత్రి తానేటి వనిత పర్యటన వివరాలు.. చాగల్లు మండలం చాగల్లు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (146వ రోజు) నిర్వహిస్తారు.. చాగల్లు సచివాలయం – 4లో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.. చాగల్లు ఇందిరమ్మ కాలనీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు.. కొవ్వూరు రూరల్ మండలం కుమారదేవంలో గండి పోసమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొంటారు. చాగల్లు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం(146వ రోజు) నిర్వహిస్తారు.
* విశాఖ: నేడు మంత్రి కారుమురు నాగేశ్వరరావు పర్యటన. సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రి
* కాకినాడ: నేడు, రేపు ఉమ్మడి జిల్లాలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన.. కార్యకర్తలకి భీమా చెక్కులు పంపిణీ, కాకినాడ లో ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ఇంఛార్జిలతో సమావేశంకానున్న మనోహర్