* ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023: నేడు ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ ఢీ.. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్
* సిద్దిపేట: నేడు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం.. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ (మం) అంతాయపల్లిలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు నాయకులు, కార్యకర్తలతో భేటీ.. హాజరుకానున్న మంత్రి హరీష్ రావు.. గజ్వేల్ లో ఈటల పోటీ చేస్తారన్న ప్రచారంతో సమావేశానికి ఏర్పడిన ప్రాధాన్యత.. గత ఎన్నికల సమయంలోనూ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించిన సీఎం.. ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
* నిర్మల్: నేడు బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో మూల నక్షత్ర పూజలు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ.. అమ్మవారు జన్మనక్షత్రం కావడంతో భారీగా తరలి వస్తున్న భక్తులు.. వేకువజాము నుంచే ప్రారంభం అయిన అక్షర శ్రీకార పూజలు.
* రాహుల్ గాంధీ మూడో రోజు విజయభేరి బస్సు యాత్ర షెడ్యూల్.. ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర వద్ద సమావేశం.. 9.30 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు.. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్.. 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లి లో సమావేశం.. మధ్యాహ్నం 1 గంటకు కోరుట్ల లో సమావేశం, 1.30కి భోజన విరామం.. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో సభ.. ఆర్మూర్ నుండి హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్న రాహుల్.. నేటితో మొదటి దశ కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ముగింపు..
* నిర్మల్: నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఆర్మూర్ సభ లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రేఖా నాయక్. ఇప్పటికే హస్తం పార్టీలో చేరిన రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్.. ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న రేఖా నాయక్.
* నేడు సిద్దిపేట జిల్లాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పర్యటన.. దుబ్బాకలో నారి శక్తి వందన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న స్మృతి ఇరానీ.. ఆనంతరం దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
* నేడు రాహుల్ గాంధీ తో కోదండరాం భేటీ.. ఉదయం 9 గంటలకు రాహుల్‌ను కలవనున్న కోదండరాం.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని కోదండరాంని కోరనున్న రాహుల్ గాంధీ
* నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీఆర్ఎస్ నేత బండి రమేష్..
* ఢిల్లీ: నేడు సాయంత్రం బీజేపీ సీఈసీ భేటీ.. వీలయినన్ని ఎక్కువ సీట్లను ఇవ్వాలనే కసరత్తు చేస్తున్న బీజేపీ.. అభ్యర్థుల కసరత్తుపై హోం వర్క్ జరుగుతోందన్న ప్రకాష్ జవదేకర్
* ఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. ఫైబర్ నెట్ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు..
* ప్రకాశం : పెద్దారవీడు మండలం మద్దలకట్టలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు.. శుక్రవారం 6వ రోజు, అలంకారం-శ్రీ కాత్యాయనిదేవి, పల్లకి సేవ సింహవాహనం
* ప్రకాశం : గిద్దలూరులో దేవి శరన్నవరాత్రులలో భాగంగా వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక అక్షరాబ్యాసం కార్యక్రమం..
* ప్రకాశం : టంగుటూరు మండలం కారుమంచిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ దినేష్ కుమార్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరుఎం ముత్తుకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరులోని పుర మందిరంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సర్వసభ్య సమావేశం
* అనంతపురం : తాడిపత్రి పట్టణంలోని యల్లనూరు రోడ్డు సర్కిల్ లో వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. హాజరుకానున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.
* విజయవాడ: ఆరవరోజు సరస్వతీదేవి అలంకారంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం.. మూల నక్షత్రం కావడంతో అర్ధరాత్రి నుంచీ క్యూలైన్లలోనే భక్తులు.. మూల నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం.. వినాయక ఆలయం వద్ద నుంచి విడతల వారీగా క్యూలైన్లలో భక్తులను వదులుతున్న పోలీసులు.. లక్షలాదిగా ఇంద్రకీలాద్రికి వస్తున్న భక్తులు.. మూడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అధికారుల అంచనా
* విజయవాడ: సరస్వతి దేవి అలంకరణలో దుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
* నేడు ఏలూరు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) రెండవ క్వార్టర్ సమావేశం.. సమావేశానికి హాజరుకానున్న ఎంపీ కోటగిరి శ్రీధర్..
* పశ్చిమగోదావరి: నేడు సర్వస్వతీ అలంకారంలో దర్శనమివ్వనున్న భీమవరం మావుళ్లమ్మ అమ్మవారు..
* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని చాపిరి గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి సెంట్రల్ జైలులో 42వ రోజుకు చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్ట్.. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
* విజయవాడ: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం
* తూర్పుగోదావరి జిల్లా : 6వ రోజు ఘనంగా రాజమండ్రి దేవిచౌక్ లోని బాలత్రిపూర సుందరి శరన్నవరాత్రి వేడుకాలు.. సరస్వతిదేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు
* నంద్యాల: శ్రీశైలంలో 6వరోజుకు చేరుకున్న దసరా మహోత్సవాలు.. నేడు సాయంత్రం కాత్యాయని అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. హంసవాహనంపై ఆశీనులై పుష్పపల్లకిలో పూజలందుకోనున్న శ్రీస్వామి అమ్మవార్లు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతులకు పుష్ప పల్లకిలో గ్రామోత్సవం
* నంద్యాల: మహానందిలో దసరా శరన్నవరాత్రులు.. నేడు కాత్యాయని దేవి అలంకరణలో దర్శనం ఇవ్వనున్న కామేశ్వరి దేవి అమ్మవారు.. సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ
* కర్నూలు: నేడు మద్దికెర మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామి వారికి సుప్రభాత సేవ, అభిషేకాలు , మంగళ హారతి తులసి అర్చన, ప్రత్యేక పూజలు.
* విశాఖ: నేడు సింహాచలం ట్ర స్ట్ బోర్డు సమావేశం.. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు అధ్యక్షతన వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష.. సింహాచలం దేవస్థానం కొనుగోలు చేయనున్న ఎలక్ట్రికల్ బస్సు ట్రయిల్ రన్ పరిశీలించనున్న పాలకమండలి
* అనంతపురం : చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాప్తాడు లో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో బిసి గర్జన సభ.
* విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు.. ఆరో రోజు సరస్వతీ దేవి అవతారంలో రాజశ్యామల.. మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసములు, సరస్వతీ పూజలు.. తెలుగు రాష్ట్రాల్లో బాసర, అయినవిల్లి తర్వాత విశాఖ శారదాపీఠంలోనే అక్షరాసములు ప్రసిద్ధి.. 6.45 గంటలకు సరస్వతీ దేవి అవతారానికి హారతులు, దేవతామూర్తుల ఆలయాల సందర్శన.. 7 గంటలకు రాజశ్యామల అమ్మవారి నిజరూపానికి విశేష అభిషేకం.. 8.30 గంటల నుంచి అక్షరాభ్యాసములు, సరస్వతీ పూజలు.. 9 గంటల నుంచి లోక కళ్యాణార్ధం రాజశ్యామల యాగం
* తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం.. సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం.. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై తరుమాడ వీధుల్లో విహరించనున్న మలయప్పస్వామి
* గుంటూరు : రేపటి నుండి ఈనెల 24 వరకు గుంటూరు మిర్చి యార్డుకు దసరా సెలవులు…
* గుంటూరు: పాత పెన్షన్ విధాన సాధన కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నిరవధిక దీక్షలు…
* గుంటూరు: నేడు పట్టాభిపురం ముస్లిం షాదీ ఖానా లో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా…
* గుంటూరు: నేటి నుండి తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో జాతీయస్థాయి నాటక పోటీలు… 24 తేదీ వరకు జరగనున్న సాంఘీక నాటక, పద్య నాటక పోటీలు
* రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మూల నక్షత్రం సందర్భంగా కాత్యాయని అవతార అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు
* జగిత్యాల: నేడు జిల్లాలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బస్సు యాత్ర.. మ.12.00 మేడిపల్లి మండల కేంద్రంలో సమావేశం.. 1 గంటకి కొరుట్లలో సమావేశం.. 1.30కి కోరుట్ల శివారులోని ముక్కస్ కన్వేషన్ లో భోజన విరామం, 2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో సభ..
* వేములవాడ పట్టణం లో నేడే సద్దుల బతుకమ్మ వేడుకలు.. మున్సిపల్ అధ్వర్యంలో మూలవాగు వద్ద సద్దుల బతుకమ్మ కి ఏర్పాట్లు.