What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు నారా లోకేష్ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసే నిరసనల వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశాలపై అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ 45వ రోజుకు చేరింది. స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు పొడిగించారు. నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణిలు బాబుతో ములాఖత్ అవుతారు.
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ-జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది.
నేడు శ్రీశైలంలో 9వ రోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. సాయంత్రం సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు శ్రీభ్రమరాంబికాదేవి దర్శనమివ్వనున్నారు. అశ్వవాహనంపై ఆశీనులై అది దంపతులు పూజలందుకోనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి, అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. సాయంత్రం ప్రభుత్వం తరపున మంత్రి గుమ్మనూర్ జయరామ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?
నేడు విజ్ఞాన్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ హాజరుకానున్నారు. ఆపై సీతారామన్ మాట్లాడనున్నారు.
ప్రపంచకప్ 2023లో నేడు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తలపడనున్నాయి. చెన్నైలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బాబర్ ఆజమ్ బృందంతో పోల్చితే.. ఏ రకంగా చూసినా కూడా అఫ్గాన్ కూనే. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లపై 270 పైచిలుకు పరుగులు చేయడం.. మ్యాచ్‌ను పలుపు తిప్పే స్పిన్నర్లు ఉండటంతో షాహిది సేనను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు.
- Tags
- ap
- ntv
- telangana
- whats today
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!