* ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023: ప్రపంచకప్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. ఉదయం 10.30 గంటలకు చెన్నైలో నెదర్లాండ్స్‌తో శ్రీలంక ఢీ.. మధ్యాహ్నం 2 గంటలకు ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో సౌతాఫ్రికా పోరు
* అమరావతి: నేడు పోలీసు అమరవీరుల దినోత్సవం.. పెరేడ్ లో పాల్గొననున్న సీఎం జగన్, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు.. ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కార్యక్రమం
* నేడు తెలంగాణ కాంగ్రెస్ సీఈసీ సమావేశం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల రెండో జాబితాపై కసర్తు
* అమరావతి: నేడు హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలుగురు అడిషనల్ జడ్జిలు హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. పాల్గొననున్న సీఎం జగన్
* సింగరేణి కార్మికులకు దసరా జోష్.. ఈ రోజు కార్మికులకు దసరా బోనస్ ఇవ్వనున్న యాజమాన్యం.. సింగరేణి లాభాల వాటాను కార్మికుల ఖాతాలో జమ చేసేందుకు తొలగిన అడ్డంకి.. పండుగకు ముందే కార్మిక ఖాతాల్లో జమ చేస్తున్న నగదు
* నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం.. తొలి జాబితాలో 50 నుంచి 70 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
* ప్రకాశం : ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎస్పీ మలిక గర్గ్ ఆధ్వర్యంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం, హాజరుకానున్న మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్..
* ప్రకాశం : త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు.. శనివారం – 7వ రోజు, అలంకారం-శ్రీ కాళరాత్రి, పల్లకి సేవ- గజవాహనం
* బాపట్ల : అద్దంకి మండలం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శరన్నవరాట్రై ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు..
* ప్రకాశం : పొదిలి మండలం ఓబులక్కపల్లెలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సనాతన సేవా ధర్మ ఆదర్శ గ్రామంలో పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, సహాయక సిబ్బంది ఆత్మీయ సమ్మేళనం..
* నెల్లూరులోని పోలీస్ పోలీస్ విధానంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం. పాల్గొననున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. ఎస్.పి.తిరుమలేశ్వర్ రెడ్డి. అధికారులు
* గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా శ్రీహరి కోట లో ఇస్రో ఆధ్వర్యంలో క్రూ మాడ్యూల్ టెస్ట్..
* నెల్లూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా
* నెల్లూరు జిల్లా: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టనున్న గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి నేడు క్రూ మాడ్యూల్ టెస్ట్ వెహికల్ ప్రయోగం.. ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్.. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రయోగం.. రాకెట్ శిఖర భాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టం ను భూమికి 17 కిలోమీటర్ల మేర పైకి పంపనున్న రాకెట్.. అనంతరం పారా చూట్స్ సాయంతో బంగాళాఖాతంలోకి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియ.. భవిష్యత్తులో విమగాములు అంతరిక్షం లోకి వెళ్లిన తరువాత తిరిగి క్షేమంగా తీసుకు వచ్చేందుకు ఇస్రో చేస్తున్న నమూనా ప్రయోగం
* నేడు ఏలూరు కలెక్టరేట్లో ఎంప్లాయి గ్రీవెన్స్ కార్యక్రమం.. రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలలో పనిచేసే ఉద్యోగుల ఇబ్బందులు పరిష్కారం కోసం ప్రత్యే గ్రివెన్స్..
* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు.. ఈరోజు శ్రీదుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న మావుళ్ళమ్మ అమ్మవారు..
* ఏలూరు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు పోలీసు పరేడ్ గ్రౌండ్స్ పరేడ్ కార్యక్రమం.. హాజరు కానున్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్.. కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్
* ఏలూరు జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం..
* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో 43వ రోజుకు చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు
* తూర్పు గోదావరి జిల్లా : నేడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నా చంద్రబాబుతో కుటుంబసభ్యులు, టీడీపీ ముఖ్య నేతల ములాకాత్.. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో ములాకాత్ కానున్న నారా లోకేష్, నారా భువనేశ్వరీ, మరొక టీడీపీ నేత
* తూర్పుగోదావరి జిల్లా : నేడు 7వ రోజు ఘనంగా జరుగుతున్న రాజమండ్రి దేవిచౌక్ లోని బాలత్రిపూర సుందరి శరన్నవరాత్రి వేడుకలు, శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.. తెల్లవారుజామున నుండి ప్రారంభమైన, కుంకుమ పూజలు.. సామూహిక పూజలకు భారీగా హాజరైన దంపతులు, మహిళలు
* అనంతపురం : పోలీసు అమర వీరుల సంస్మరణ దినం వేడుకల్లో భాగంగా నగరంలోని పోలీసు అమర వీరుల స్థూపం వద్ద నివాళ్ళు అర్పించనున్న డీఐజీ అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ.
* విశాఖ: నేడు నగరంలో ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజనీ పర్యటన.. KGHలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి…
* విశాఖ: ఆర్కే బీచ్ లోని పోలీస్ మెస్ వద్ద పోలీసు అమర వీరుల సంస్మరణ దినం కార్యక్రమం.. పోలీసు అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్న పోలీసు అధికారులు….
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఏడవ రోజుకి చేరుకున్న దసరా వేడుకలు… ఇవాళ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు.. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం..
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 7వరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు .. సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. గజవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం
* కర్నూలు: కోడుమూరు శ్రీ వల్లెలాంబదేవి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు.. నేడు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం
* కాకినాడ: నేడు అన్నవరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ వ్యతిరేక వర్గం ఆత్మీయ సమ్మేళనం.. పర్వత వద్దు వైసీపీ ముద్దు అనే నినాదంతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న జెడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు