* ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023: నేడు దక్షిణాఫ్రికాతో నెదర్లాండ్స్ ఢీ.. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్
* రాజన్న సిరిసిల్ల జిల్లా: నేడు సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ.. హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. లక్ష మంది హాజరుకానున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేసిన సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలు.. సభ కోసం ఏర్పాట్లు పూర్తి.
* అమరావతి: ఇవాళ ఆర్ధిక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
* విశాఖ: ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌లో వసతుల పరిశీలన కోసం నేడు క్షేత్రస్థాయి పర్యటన.. సీఎంవో తరలింపు, హెచ్‌వోడీ కార్యాలయాల ఏర్పాటు కోసం సీనియర్ ఐఏఎస్‌లతో త్రీమెన్ కమిటీ .. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి అధ్యక్షతన, కమిటీ మెంబర్లు ఎస్. ఎస్. రావత్, జి.ఏ.డీ. సెక్రటరీ పోలా భాస్కర్.. VMRDAలో జిల్లా ఉన్నతాధికారులతో ఒక విడత సమావేశం నిర్వహించిన కమిటీ సభ్యులు.. వివిధ శాఖల కార్యాలయాలలో వసతి సౌకర్యాలు సంబంధిత వివరాలు సేకరించిన త్రిసభ్య కమిటీ….
* ఢిల్లీ: ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు “క్వాష్” పిటీషన్ పై విచారణ.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా.ఎమ్.త్రివేది లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు.. 45వ ఐటెమ్ గా లిస్ట్. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూద్రా… ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోత్గి వాదనలు.
* ఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.
* ఈ రోజు బిక్కాజిపల్లికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలోని ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించనున్న కిషన్‌రెడ్డి.
* తెలంగాణలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పర్యటన.. శేరిలింగంపల్లి, చందానగర్, శ్రీ సప్తపదిస్ క్రిస్టల్ గార్డెన్స్ లో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న గోయల్.
* హైదరాబాద్: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు మృతి.. ఈ రోజు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
* ప్రకాశం : త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవములు. మంగళవారం.. 3వ రోజు.. అలంకారము.. శ్రీ చంద్రఘంటా దేవి.. పల్లకి సేవ.. వ్యాష్రువాహనము
* ప్రకాశం : మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శరన్నవరాత్రుల భాగంగా మూడవ రోజు రాజ్యలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం.. శివాలయంలో శ్రీ జగదాంబ అమ్మవారు చంద్ర ఘంట అలంకారంలో భక్తులకు దర్శనం.
* ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు పొదలకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో పార్టీ నేతల సమావేశం
* నెల్లూరు: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు
* అనంతపురం: గుంతకల్లు రైల్వే డివిజన్లో దసరా పండుగకు ఈనెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ -తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రయాణం
* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోరంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో 39వ రోజుకు చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. ఈనెల 19వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్
* తూర్పు గోదావరి జిల్లా : నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాకాత్.. నిన్న సాయంత్రానికే రాజమండ్రి టీడీపీ క్యాంపునకు చేరుకున్న భువనేశ్వరి, నారా బ్రాహ్మణి.. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు..
* కాకినాడ: నేడు జెడ్పీ సర్వ సభ్య సమావేశం.. హాజరుకానున్న ఉమ్మడి జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు
* విజయవాడ దుర్గ గుడి ఆలయంలో దసరా ఏర్పాట్లును పరిశీలించనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు. అమ్మవారి దసరా ప్రత్యేక అలంకరణలో భాగంగా గాయత్రీ దేవి దర్శనం ఇవ్వనున్న అమ్మవారు..
* అనంతపురం : నేడు ఏపీ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర సదస్సు.. హాజరు కానున్న ఎంపీ బినయ్ విశ్వం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
* తూర్పుగోదావరి జిల్లా: మూడో రోజు ఘనంగా జరుగుతున్న రాజమండ్రి దేవిచౌక్ లోని బాలత్రిపూర సుందరి శరన్నవరాత్రి వేడుకలు.. గాయత్రిదేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు
* చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి సచివాలయ పరిధిలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 8 గంటలకు సింహ వాహనం.. రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగనున్న మలయప్పస్వామి
* విజయవాడ: ఇంద్రకీలాద్రి పై అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మ.. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు.. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకుంటే అన్నపానాదులకు లోటుండసని ప్రతీతి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి ఏర్పాట్లు చేసిన అధికారులు.
* నేడు శ్రీశైలంలో 3వరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం చంద్రఘంట అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. రావణవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి, అమ్మవారి గ్రామోత్సవం
* నంద్యాల: బనగానపల్లె మండలం నందవరంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవ రాత్రి మహోత్సవ వేడుకలు.. నేడు 3వ రోజు చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న చౌడేశ్వరిదేవి అమ్మవారు
* నంద్యాల: మహానంది క్షేత్రంలో మూడవరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, నేడు చంద్ర ఘంట దుర్గాదేవి అలంకరణలో దర్శనం ఇవ్వనున్న కామేశ్వరీ దేవి అమ్మవారు
* విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు.. మూడో రోజు వైష్ణవీ దేవి అవతారంలో రాజశ్యామల
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్య సన్నిధిలో ఘనంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. నవరాత్రుల్లో భాగంగా నేడు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.