నేడు మహారాష్ట్రకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్షి ఆలయాన్ని బాబు సందర్శించనున్నారు. మధ్యాహ్నం షిరిడీ సాయిబాబాను దర్శించుకొనున్నారు. నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెళ్లనున్నారు. రాష్ట్రంలో హింసను కంట్రోల్ చేసేందుకు తీసుకున్న చర్యలపై సీఈసీకి వివరణ ఇవ్వనున్నారు. నేటి నుంచి ఏపీ ఈఏపీఎస్ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని…
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం. ప్రధాని మోడీ నేడు యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖ…