* టీ20 వరల్డ్ కప్: నేడు కెనడాతో ఐర్లాండ్ ఢీ.. రాత్రి 8 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: నేడు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం.. తమ పార్లమెంట్ లీడర్ గా మోడీని ఎన్నుకొనున్న ఎన్డీఏ ఎంపీలు.. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశం.. హాజరుకానున్న ఎన్డీఏ పక్ష ముఖ్యనేతలు, బీజేపీ ముఖ్యమంత్రులు.. ఇవాళ రాత్రి 7 గంటలకు నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ ముఖ్యనేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్న ఎన్డీ
* ఢిల్లీ: ఎల్లుండి ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ
* పరువు నష్టం దావా కేసులో నేడు బెంగళూరు కోర్టుకు హాజరుకానున్న రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్
* నేడు, రేపు కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేయనున్న జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ జస్టిస్ పినాకి చంద్ర గోష్.. నేడు అన్నారం, రేపు సుందిల్ల బ్యారేజిలు పరిశీలన. 15 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం నుంచి విచారణను ప్రారంభించనున్న కమిషన్.
* హైదరాబాద్: నేటి నుండి బేగంబజార్, ఉస్మాన్ గంజ్ లలో హమాలీ కార్మికులు స్ట్రైక్.. విధులు బహిష్కరించనున్నట్లు ప్రకటించిన హమాలీ కార్మికులు
* T20 క్రికెట్ వరల్డ్ కప్‌లో USA సంచలనం.. పాకిస్థాన్ పై సూపర్ విక్టరీ.. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ లో విజయం.. పాక్-159/7, యూఎస్‌ఏ-159/3.. సూపర్ ఓవర్లో 18 రన్స్ చేసిన USA, సూపర్ ఓవర్లో 13 రన్స్ మాత్రమే చేసిన పాక్.. 5 పరుగుల తేడాతో USA గెలుపు
* హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై సందర్శిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్..
* ప్రకాశం : ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతల విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంఎల్ఏ దామచర్ల జనార్దన్..
* బాపట్ల : వేటపాలెం మండలం దేశాయిపేట జనసేన పార్టీ కార్యాలయంలో జరిగే కూటమి విజయోత్సవ వేడుకలలో పాల్గొననున్న చీరాల ఎంఎల్ఏ మద్దులూరి మాల కొండయ్య..
* నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గ టిడిపి నేతలతో ఎమ్మెల్యే ఆనం సమావేశం
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అభినందన సభ
* శ్రీ సత్యసాయి : హిందూపురం నియోజకవర్గ నాయకులు,కార్యకర్తల సమావేశం.
* తిరుమల: 27 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62161 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 28923 మంది భక్తులు.. హుండీ ఆదాయం 3.35 కోట్లు