*నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ చంద్రబాబు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు.. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు.. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీ.. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ.
*నేడు ఏపీకి ప్రధాని మోడీ.. ఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని.
*నేడు, రేపు చంద్రబాబు తిరుమల పర్యటన.. సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత రాత్రి తిరుమలకు చంద్రబాబు.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు.
*ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.. 24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు.. మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు , నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు.. ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.
*అమరావతి: ఒక్క స్థానాన్ని భర్తీ చేయకుండా వదిలిన చంద్రబాబు.. చంద్రబాబు సహా 26 స్థానాలకు 25 మందితో కేబినెట్ కూర్పు.. ఖాళీగా ఉన్న ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేక టీడీపీకా అనే చర్చ.
*హైదరాబాద్: నేడు సెక్రటేరియట్‌లో 317, 46 జీవో సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్న దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్.. ఇటీవలే 317, 46 జీవోలో సమస్యల పరిష్కారం కోసం వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
*హైదరాబాద్: నేడు జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ ముందుకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ నిపుణుడు రఘు, పలువురు విద్యుత్ నిపుణులు.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై వివరాలు ఇవ్వనున్న కోదండరాం, రఘు
*తిరుమల: 21 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,665 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,377 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు.
*నేడు సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎం ప్రమాణస్వీకారం.. ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మోహన్ మాఝీ.. మోహన్ మాఝీ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోడీ.
*టీ20 ప్రపంచకప్: నేడు భారత్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్.. రాత్రి 8 గంటలకు ప్రారంభం