జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నేడు ప్రారంభం కానుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా తణుకులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సభలోనే లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. నేడు ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఆయన మహిళ ఉద్యోగులతో కలిసి పాల్గొననున్నారు. ఢాకాలో నేడు హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ జరుగనుంది. సెమీస్‌లో జపాన్‌తో భారత్ తలపడనుంది. బీజేపీ పార్లమెంటరీ…