నేడు ఏపీలో సినిమా టికెట్ పరిశీలన కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఏపీ సెక్రటేరియట్ లో సమావేశం జరుగనుంది. అయితే గత నెలలో కూడా సినిమా టికెట్ల విషయమై కమిటీ సమావేశమైంది. సభ్యుల సూచనలు మేరకు ఈ రోజు మరోసారి కమిటీ చర్చించనుంది. శంషాబాద్ ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 9 గంటలకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు వాస్తుశాంతి, రుత్విక…