ఐసీసీ మెగాటోర్నీలో టీమిండియా ఓడిపోయిన ప్రతిసారి ఓ వీక్ టీమ్ తో బీసీసీఐ సిరీస్ ను ఏర్పాటు చేస్తుంది. ఇక, ఆ సిరీస్ లో మనోళ్లు రెచ్చిపోయి ఆడతారు. దీంతో గతంలో వచ్చిన విమర్శలకు చెక్ పెడతారు. ఇలాంటి సిరీస్ ప్రస్తుతం టీమిండియా-వెస్టిండీస్ మధ్య కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటమి తర్వాత ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఆడాల్సింది. అయితే మరీ ఆఫ్ఘాన్‌తో సిరీస్ అంటే అందరి నుంచి విమర్శలు వస్తాయని అనుకుందో ఏమో గానీ.. రెండు నెలలు ఐపీఎల్ ఆడిన ఇండియన్ ప్లేయర్లకు కాస్త రెస్ట్ ఇచ్చింది. ఇక, నెల రోజుల బ్రేక్ తర్వాత వెస్టిండీస్ తో టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది.
Read Also: Tamannah : హాట్ పోజులతో మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..
అసలే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేక కుమిళిపోతున్న వెస్టిండీస్ పై టీమిండియా తమ ప్రతాపం చూపిస్తోంది.. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి చిన్న టీమ్స్ కూడా విండీస్ బౌలింగ్ ని ఓ ఆటాడుకున్నారు.. కానీ మనోళ్లు వాళ్ల బౌలింగ్ లో ఆడేందుకు పడుతున్న ఇబ్బంది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఆడి కూడా భారత జట్టు బ్యాటింగ్‌లో ఇంత అతి జాగ్రత్త కనబడలేదు.. కానీ విండీస్ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ చేసేందుకు 220 బాల్స్ ను ఎదుర్కొన్నాడు. తన టెస్టు కెరీర్‌లో అత్యంత స్లోగా వచ్చిన శతకం ఇదే..
Read Also: Venky Re Release: వెంకీ రీరిలీజ్.. సీట్లు జాగ్రత్తమ్మా
తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ, తన క్లాస్ బ్యాటింగ్ చూపించాలని తపన పడుతున్నాడంటే ఏమో అనుకోవచ్చు.. కానీ విరాట్ కోహ్లీ కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో అందరిని విసిగించాడు. మొదటి బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్న విరాట్, 96 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు.. అది కూడా 81 బంతులు ఆడిన తర్వాత వచ్చింది. కోహ్లీ ఇంత జాగ్రత్తగా ఆడడం ఎప్పుడూ కనిపించలేదు.. ఆఖరికి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా కోహ్లీ ఇలా ఆడలేదు.
Read Also: Botsa Satyanarayana: చంద్రబాబు మళ్లీ సీఎం అనేది కల.. మర్చిపొండి ఇక..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టడంతో.. ఇక తాను కూడా సెంచరీ చేయాలని విరాట్ కోహ్లీ అనుకుంటున్నాడు. అందుకోసమే.. తన జిడ్డు బ్యాటింగ్ తో విసిగిస్తున్నాడు. ఇంతకు ముందే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నట్టుగా వెస్టిండీస్‌తో సిరీస్, మనోళ్ల రికార్డుల కోసమే ఆడుతున్నారు అనేది నిజం అవుతుంది. ఇప్పుడు టీమిండియా ఆడుతున్న విధానం అలాగే కనిపిస్తుంది. పిచ్ స్పిన్నర్లు, బౌన్సర్లకు సహకరిస్తున్నా.. మనోళ్ల బ్యాటింగ్ చూస్తుంటే విసుగోస్తుంది. ఇలాంటి ఛాలెంజింగ్ పిచ్‌లు టీమిండియాకు కొత్తేమీ కాదు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను, అక్కడి గ్రీన్ పిచ్‌లపైనే ఎదుర్కొన్నారు. అయితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత వచ్చిన విమర్శలను తిప్పికొట్టేందుకు టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.